పథకాలు సరే ... వీళ్ళ సంగతేంటి ?

ముగిసిన 4 పథకాలపై క్షేత్ర స్థాయి సర్యే లబ్దిదారుల ఎంపికపై పలు అనుమానాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా , కొత్త ఆహార భద్రత కార్డులు , ఇందిరమ్మ ఇళ్ళ పథకాల క్షేత్ర స్థాయి సర్యే దాదాపు పూర్తయింది. ఈ సర్యేలో నాలుగు పథకాలకు లబ్దిదారులను గుర్తించడంతో పాటు ముసాయిదా లబ్దిదారుల జాబితాను కూడా తయారు చేశారు. ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఫైనల్ చేస్తారు. 25 లోగా డేటా ఎంట్రీ పూర్తి చేసి , జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో పెడతారు. గ్రామంలో ప్లేక్షీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 26 నుండి పథకాలు అమలవుతాయి. అయితే , లబ్దిదారుల ఎంపికపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు కొంత మంది అర్హులకు అవరోధంగా మారుతున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యులే అంటున్నారు. మంచి పథకాలంటూనే నిబంధనలను సడలించాలని కోరుతున్నారు. మొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు తుమ్మల , ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటి రెడ్డి వెంకట్ ...