మున్నేరు రిటైనింగ్ వాల్ పనుల పురోగతిపై పొంగులేటి అసంతృప్తి

Ponguleti Srinivas Reddy


 

  • భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి
  • ఈ నెల 16 నాటికి పనుల షెడ్యూల్ సమర్పించాలి
  • జూలై 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి
  • అధికార్ల సమీక్షా సమావేశంలో మంత్రి ఆదేశం

ఖమ్మం వద్ద మున్నేరు నదికి ఇరు వైపుల రూ. 690 కోట్లతో ఇర్మించ తలపెట్టిన రిటైనింగ్ వాల్ పనుల పురోగతిపై రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రోజువారి పనుల వివరాలతో షెడ్యూల్ రూపొందించి, జనవరి 16 నాటికి సమర్పించాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. ఆదివారం ఆయన ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్లోని తన నివాసంలో  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ, భూసేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ వివరాలను, నిర్మాణ పురోగతిని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగే లోగా, ప్రైవేట్ భూముల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యేలా రెవెన్యూ అధికారులు ప్రాధాన్యతతో పని చేయాలన్నారు. గోడ నిర్మాణానికి ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం వైపు అందుబాటులో ఉన్న 5.1 కిలో మీటర్ల ప్రభుత్వ భూమిలో, ఖమ్మం అర్బన్ మండలం వైపు వున్న 1.7 కిలో మీటర్ల ప్రభుత్వ భూమిలో ముందు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సేకరించాల్సిన ప్రైవేట్ భూముల యజమానులతో చర్చించి, సదరు భూములను వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా తహసిల్దార్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్నేరు వద్ద క్లియర్ గా ఉన్న 8 కిలో మీటర్ల మేర ట్యాగింగ్ చేయాలని, ఫీల్డ్ లో పెద్ద ఎత్తున అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు ముమ్మరంగా జరిగేలా చూడాలని సూచించారు. జనవరి 15 నుంచి భూ సేకరణ పురోగతిని ప్రతి రోజూ పర్యవేక్షిస్తానని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇర్రిగేషన్ ఎస్ఇ వెంకటేశ్వర రావు, ఇఇ అనన్య, ఆర్డీఓ నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు రవి కుమార్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు