Posts

Showing posts from September, 2024

సీతారామను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలి

Image
  యాతాలకుంట టన్నెల్ పనులు శరవేగంగా చేపట్టాలి నిర్ణిత గడువులోపు నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి భూసేకరణలో అలసత్వం వహించ వహించ వద్దు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ఉత్తమ్ , పొంగులేటి   సీతారామ ప్రాజెక్ట్ టన్నెల్ , కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర వ్యవసాయ శాఖా , మంత్రి మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు మేరకు జల సౌదలో   సీతారామ ప్రాజెక్టు పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మంత్రులు తుమ్మల , పొంగులేటితో కలసి నీటి పారుదల శాఖాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ యాతాల కుంట టన్నెల్ పనులను శర వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ పంప్ హౌజ్లను ప్రారంభించామని , మిగిలిన కాలువలను , టన్నేల్ పనులను యుద్ధ ప్రాతి పదికను పూర్తి చేయాలన్నారు.   ప్రాజెక్టుకు సంబ...

రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు

Image
రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన .ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లో కలయదిరిగి పెసల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలను గిట్టుబాటుకు అమ్ముకోవడంలో ఎటువంటి అసౌకర్యం కలగ కూడదన్నారు. ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. Janechcha

గోదారి వరదల వల్ల భక్తులకు ఇబ్భంది కలగదు ... మంత్రి తుమ్మల

Image
  భద్రాద్రి రాముని భూములపై సర్యే చేయాలని ఆదేశం పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలానికి వచ్చే భక్తులకు గోదావరి వరదల వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ జౌళి శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలం పట్టణాన్ని పరిశుభ్రముగా వుంచాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై వుందని అన్నారు. బుధవారం సబ్ కలెక్టరు కార్యాలయంలోని సమావేశ మందిరములో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ సీతమ్మ నడయాడిన ...   రాముడు కొలువై ఉన్న దేవస్థానం భూములను సర్వే చేసి పది కాలాల పాటు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే భక్తులకు దుర్గంధం వెదజల్ల కుండా దేవస్థానం పరిసరాలతో పాటు భద్రాచలం వీధుల్లో చెత్త ఎక్కడ బడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ... ఎప్పటి కప్పుడు చెత్తను ఏరివేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా డంపింగ్ యార్డ్ ల్లో వేయాలని గ్రామపంచాయతీ...

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కితాబు

Image
ఖమ్మం , పాలేరు , మధిర ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నేరుగా రైతులతో మాట్లాడిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలతో ప్రాణనష్టం చాలా వరకు తగ్గిందన్న కేంద్రమంత్రి ఏపీ , తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. మరో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ , తెలంగాణ ఉపముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం , పాలేరు , మధిర ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నేరుగా ఆయన పాలేరు మెయిన్ కెనాల్ వద్ద లాండై , కాల్వ తెగటం వల్ల ఖమ్మం- నుండి సూర్యాపేట వైపు వెళ్ళే జాతీయ రహదారికి జరిగిన నష్టాన్ని చూశారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడారు. వరదల వల్ల తాము సర్వం కోల్పోయామని ఈ సందర్భంగా రైతులు కేంద్ర మంత్రికి తమ గోడును వెళ్ల బోసుకున్నారు. ఓ రైతు తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ బోరున విలపించడంతో చౌహాన్ కుర్చీలో నుంచి లేచి ఆ రైతును వేదిక పైకి పిలిచి ఓదార్చారు. తాను కూడా రైతునేనని , తనకు రైతుల ...

ఖమ్మం కేంద్రంగా ... బురద రాజకీయం

Image
ఖమ్మం కేంద్రంగా ... బురద రాజకీయం నడుస్తోంది. మున్నేరు ముంపుపై అధికార కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలు .... రోపణలు ప్రత్యారోపణలు ... దాడులు ప్రతి దాడులకు దిగుతున్నారు. సహాయక చర్యలపై రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ... మాజీ మంత్రి హారీష్ రావు మధ్య ఒకవైపు మాటల తూటాలు పేలుతుండగానే ... మరో వైపు ఖమ్మంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ముంపు ప్రాంత బాధితులకు సహాయం చేయాల్సిన చేతులతో కర్రలు రాళ్ళు పట్టుకొని దాడులు చేసుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ , సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి జరిగింది. సహాయం కోసం వరద బాధితులు ఆర్తనాదాలు చేస్తుంటే ... సహాయక చర్యలకు ఆటంకం కలిగేలా ఈ గొడవలేంటి ? ఈ రాజకీయమెందుని ఖమ్మం ప్రజానీకం అవాక్కవుతోంది. మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన ముగించుకొని వెళ్ళిన తర్వాత ... వరద బాధితులను పరామర్శించేందుకు మాజీ మంత్రులు హరీశ్ రావు , పువ్వాడ అజయ్ కుమార్ , సబితా ఇంద్రారెడ్డి , జగదీశ్వర్ రెడ్డి , ఎం‌పి వద్దిరాజు రవిచంద్ర , మాజీ ఎం‌పి నామ నాగేశ్వర రావు నగరంలోని బొక్కల గడ్డకు...