గోదారి వరదల వల్ల భక్తులకు ఇబ్భంది కలగదు ... మంత్రి తుమ్మల

 

Thummala Nageswara Rao

  • భద్రాద్రి రాముని భూములపై సర్యే చేయాలని ఆదేశం
  • పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన

శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలానికి వచ్చే భక్తులకు గోదావరి వరదల వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ జౌళి శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలం పట్టణాన్ని పరిశుభ్రముగా వుంచాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై వుందని అన్నారు. బుధవారం సబ్ కలెక్టరు కార్యాలయంలోని సమావేశ మందిరములో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ సీతమ్మ నడయాడిన ...  రాముడు కొలువై ఉన్న దేవస్థానం భూములను సర్వే చేసి పది కాలాల పాటు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే భక్తులకు దుర్గంధం వెదజల్ల కుండా దేవస్థానం పరిసరాలతో పాటు భద్రాచలం వీధుల్లో చెత్త ఎక్కడ బడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ... ఎప్పటి కప్పుడు చెత్తను ఏరివేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా డంపింగ్ యార్డ్ ల్లో వేయాలని గ్రామపంచాయతీ ఈవో కు సూచించారు. పునరావాస కేంద్రాల్లో కూడా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. భద్రాచలాన్ని రాబోయే రోజుల్లో సర్వ సుందరంగా తీర్చిదిద్ది కీర్తి ప్రతిష్టలు పెంచేలా చూడాలని కోరారు. గోదావరి వరదలు రాక ముందే మే జూన్ మాసాల్లో  డ్రిప్ ఇరిగేషన్ ద్వారా స్లూయిస్ పాయింట్ దగ్గర శాశ్వత నిర్మాణం చేపట్టి భద్రాచలం పట్టణములో నీరు నిలువ లేకుండా నిలువరించాలని, భద్రాచలం పట్టణం నుండి గుండాల, వాజేడు వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.  

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు