చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు
చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు మధిర అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు మంచిది క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అని పనిచేసే వారిని గెలిపించుకోవాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల వారు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ పోతారు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి వచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను...