అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకో లేరు

Madhira CPM
  • భట్టి ప్రోద్బలంతోనే అక్రమ కేసులు
  • ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, లేదంటే ఉద్యమం ఉదృతం
  • సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
( తాళ్లూరి అప్పారావు, మధిర )

మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రోత్బలంతోనే మధిర, బోనకల్, చింతకాని మండలాలలో పోలీసులు సిపిఎం పార్టీ కార్యకర్తలపై వాస్తవాలకి విరుద్ధంగా అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకోలేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మధిర పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వెంటనే వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడు గ్రామంలో సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య జరిగి రెండు నెలలు గడుస్తున్న హంతకులు ఎవరో పోలీసులకు తెలిసిన తెలియనట్లు నటిస్తూ, హంతకుల కోసం కుటుంబ సభ్యులను పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధించటం ఏమిటని ప్రశ్నించారు. గడిచిన పంచాయితీ ఎన్నికల తరువాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణి మల్లు నందిని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి సిపిఎం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయించడం దాడులకు గురైన సిపిఎం పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి వెళితే వారిపైనే హత్యాయత్నం కేసులు మోపి జైలుకు పంపించడం దారుణం అన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తలకు బట్టి అండదండలతో పోలీస్ సాయ సహకారాలు అందించడం నియోజకవర్గంలో శాంతిభద్రతలకు తీవ్రమైన విఘాతం కలుగుతుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడే నాయకులపై ఇలాంటి కేసులు చరిత్రలో కొత్తేమీ కాదని, ఇలాంటి కేసులకు భయపడి కమ్యూనిస్టులు చేతులు కట్టుకొని కూర్చోరని వాటికి సరైన సమాధానం పోరాటాల ద్వారా చెప్తామని హెచ్చరించారు.  నియోజకవర్గంలో పెరుగుతున్న హింసకు అక్రమ కేసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో పోలీసు రాజ్యం నడపాలని ప్రయత్నం చేసిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయారని మల్లు భట్టి విక్రమార్క వెంటనే ఈ అప్రజాస్వామిక చర్యలను వేధింపులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. 

Madhira CPM

పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ  మధిర నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉందని మధిర నుండి శాసనసభ్యులుగా సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎంత మంది పనిచేసిన ప్రజలపై పోలీసులను ఉపయోగించి నిర్బంధాన్ని ప్రయోగించాలని చూస్తే సహించే స్వభావం మధిర ప్రజలకు లేదని గుర్తించాలని అన్నారు. నాటి నైజాం నవాబుల పరిపాలనను వ్యతిరేకిస్తూ సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటానికి పుట్టినిల్లు మధిర, మధిర నుండి  అనేక గ్రామాలలో సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైన యోధుల చరిత్ర కన్న భూమి ఇది అరాచకాలకు పోలీస్ నిర్బంధాలకు భయపడేవారు మధిరలో లేరని ప్రజాస్వామ్యాన్ని మాత్రమే ప్రజల స్వీకరిస్తారని అధికార అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. పోలీసులను చేతుల్లో ఉంచుకుని చేయని తప్పులకు సిపిఎం పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులను బనాయిస్తే గ్రామాల్లో ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని గుర్తుంచుకోవాలని అన్నారు. 
పోలీసులు ప్రజా సేవకులని మరిచి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే తాము తీసుకునే జీతానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని తాము ఉద్యోగం లో చేరే నాడు చేసిన ప్రమాణానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని వాస్తవాలను అవాస్తవాలను వేరుచేసి ప్రజలకు చట్టబద్ధమైన న్యాయాన్ని ప్రజల శాంతిభద్రతలను కాపాడే వైఖరిని తీసుకొని పనిచేయాలని సూచించారు. అవినీతి సొమ్ము కోసమో అధికార పార్టీ నాయకుల మెప్పు కోసమో మీ మనస్సాక్షిని తాకట్టు పెట్టవద్దని చట్టబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. మల్లు భట్టి విక్రమార్క నిరంకుశ వైఖరి మారకుంటే పోలీస్ వైఖరి మారకుంటే రానున్న కాలంలో బట్టి క్యాంప్ ఆఫీస్ తో పాటు పోలీస్ స్టేషన్లో ముట్టడి కూడా ప్రజల సిద్ధమవుతారని హెచ్చరించారు. 

Madhira CPM

పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు బట్టి విక్రమార్క తాము చేసిన తప్పుల పట్ల తీవ్రమైన భయంతో ఆందోళనతో ఉన్నారని సిపిఎం పార్టీ శాంతియుత ప్రదర్శన కు పిలుపునిస్తే ఖమ్మం నుండి ఎర్రుపాలెం వరకు గ్రామ గ్రామాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలను సాధారణ ప్రజలను ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసుల సహాయంతో అడ్డుకోవాలని ప్రయత్నించడం ప్రజా పరిపాలనలో భాగమేనా అని ప్రశ్నించారు.  నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే ప్రజలను అడ్డుకోవడం భారత రాజ్యాంగంలో బట్టి విక్రమార్క కోసం ప్రత్యేకమైన సెక్షన్ లో ఉన్నాయా అని ప్రశ్నించారు?  లేదా మధిర నియోజకవర్గంలో బట్టి విక్రమార్క కోసం పోలీసు వారు ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని సృష్టించారా కొత్త చట్టాన్ని సృష్టించారని ప్రశ్నించారు?  మీరు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించిన వాటన్నిటినీ చేదించుకుంటూ వేలాదిమంది ప్రజలు ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే మధుర నియోజకవర్గ పోలీస్ పై బట్టి విక్రమార్క పరిపాలనపై ప్రజలు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారని అన్నారు. సిపిఎం పార్టీ అభివృద్ధి చూసి ఓర్వలేక బట్టి విక్రమార్క హత్యలు ద్వారానో పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూడడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు. అక్రమంగా బనాయించిన కేసుల నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి పద్మ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు మధిర మండల కార్యదర్శి మందా సైదులు ముదిగొండ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం పట్టణ కార్యదర్శి పడకండి మురళి డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య బండారు రమేష్ పయ్యావుల ప్రభావతి మందడపు ఉపేంద్ర రావు సిపిఎం పార్టీ సర్పంచులు  వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular Posts

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి

ఈ నెల 28న కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు