సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి
- డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కమిటి సమావేశంలో రాష్ట్ర నేత ఎన్. ఎస్ రావు
- ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపాలని కోరుతూ సమావేశంలో తీర్మానం
- యూనియన్ ప్రెస్ క్లబ్ వ్యవహారాల ఇంచార్జీగా కె. కళ్యాణ్ చక్రవర్తి నియామకం
పలు తీర్మానాల ఆమోదం
ముందుగా సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, యూనియన్ విస్తరణ, ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం, యూనియన్ తరుపున ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కె. కళ్యాణ్ చక్రవర్తిని ఇంచార్జిగా నియమించారు. అంతే కాకుండా, సాధ్యమైనంత త్వరగా ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరపాలని సంబంధిత జిల్లా అధికార్లను కోరుతూ తీర్మానం చేశారు.అలాగే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు త్వరలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ సమావేశంలో మరో తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కోకన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జి కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు గోగుల నారాయణ రావు, కొమ్మినేని ప్రసాద రావు, ఏనిగండ్ల శ్రీనివాస రావు, బొడ్డుపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
Comments
Post a Comment