మీరు గెలిపించండి ... నేను అభివృద్ధి చేస్తా
- ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
- పలు వార్డుల్లో రోడ్డు షో ... పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు
గత పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా ఆనాటి 'దొర'కు లేక పోయిందని తెలంగాణ
రెవెన్యూ, గృహ
నిర్మాణం, సమాచార
శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, తమ ప్రజా ప్రభుత్వం
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుందని చెప్పారు. ఏదులాపురం
మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ... ఈ ప్రాంతాన్ని
అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటాను" అని ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో
రోడ్ షో నిర్వహించారు. రెడ్డిపల్లి (1వ వార్డు) నుండి ప్రారంభమైన ఈ రోడ్ షో ముత్తగూడెం, గొల్లగూడెం, బారుగూడెం మీదుగా
ఏదులాపురం, మద్దులపల్లి, తెల్దారుపల్లి వరకు
కొనసాగింది. మంత్రి పొంగులేటి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
మహిళలు హారతులతో స్వాగతం పలకగా, పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

.jpeg)

Comments
Post a Comment