కేసీఆర్ సంచలన నిర్ణయం ... బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల కాలంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ ( BRS )పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భారత్ కుమార్, టి. రవీందర్ రావు ప్రకటించారు. ఈ మేరకు, మీడియాకు ఒక లేఖను విడుదల చేసిన వారు, పార్టీ అధ్యక్షులు కె. చంద్ర శేఖర్ రావు కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
కొంత కాలంగా కవిత సొంత పార్టీ నేతలనుద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని కుదిపేస్తున్నాయి. కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నాయని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కూడా బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ.. హరీశ్ రావు, సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
.jpeg)

Comments
Post a Comment