కవిత సంచలన ఆరోపణలు .. హరీశ్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్‌కి చెడ్డ పేరు

MLC Kavitha

తెలంగాణ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao ), మాజీ ఎంపీ సంతోష్ తనపై అనేక కుట్రలు చేశారని, అయినప్పటికీ తాను ఏమీ మాట్లాడ లేదని అన్నారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఉన్నారని, వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని కవిత ఆరోపించారు. అందుకే రేవంత్ రెడ్డి వారిని ఏమీ అనడం లేదని అన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram Project ) లో చిన్న భాగం కుంగి పోతే మొత్తం ప్రాజెక్టే పోయిందని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( KCR ) కు చెడ్డ పేరు రావడానికి ఆయన పక్కన ఉన్న కొందరు చేసిన పనులే కారణమని పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు పాత్ర అందులో లేదా ? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

సంతోష్, హరీశ్ రావు, మేఘా ఇంజినీరింగ్ సంస్థల వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందని కవిత అన్నారు. "ఈరోజు కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నాను. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి, లేక పోతే ఏంటి?" అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది తన తండ్రి పరువుకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు.

గతంలో తన లేఖ బయటకు వచ్చినప్పటికీ తాను ఎవరి పేర్లనూ బయటపెట్ట లేదని కవిత అన్నారు. కేసీఆర్ ప్రజల కోసం పని చేస్తే, అవతలి వాళ్లు ఆస్తులు పెంచుకోవడానికి పని చేశారని ఆమె విమర్శించారు. కేసీఆర్ హిమాలయ పర్వతం ( Himalayas ) లాంటి వారని కవిత అభివర్ణించారు. "నాకు పెళ్లి చేసేందుకు కూడా మా నాన్న ఇబ్బంది పడ్డారు. అలాంటి దేవుడి లాంటి వ్యక్తిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం బాధగా ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను నిన్న అన్ని మాటలు అంటుంటే ఒక్కరు కూడా నోరు విప్పక పోవడం ఏమిటని కవిత ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు పెడతారు కానీ, సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఎందుకు పోరాడడం లేదని నిల దీశారు. బీహార్ కోసం తెలంగాణ ( Telangana ) లోని బీసీ బిడ్డలను బలి చేస్తున్నారని ఆమె విమర్శించారు. సీబీఐ కాదు, ఇంకే విచారణ జరిగినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి