ఖమ్మంలో సమ్మె సంపూర్ణం ... ప్రశాంతం
- డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
- మధ్యాహ్నం వరకు తిరగని ఆటోలు
- పలుచోట్ల భారీ ర్యాలీలు, ధర్నాలు
సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్మిక సంఘాలు బంద్
పాటించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది.
వామ పక్ష కార్మిక సంఘాల నేతలు బంద్ ను పర్యవేక్షించారు. ఆర్టిసి బస్సులు డిపోలకు, బస్టాండ్లకు
పరిమితమయ్యాయి. మధ్యాహ్నం వరకు ఆటోలు కూడా తిరగ లేదు. బంద్ సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్)మాస్లైన్, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ, ఏఐటియుసి, సిఐటియు, ఐఎన్టియుసి, టియుసిఐ, బిఆర్డియు తదితర
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలోని పలుచోట్ల భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
అశ్వాపురం భార జల కర్మాగార, సింగరేణి బొగ్గు గని, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
వివిధ పార్టీలు, కార్మిక
సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అగ్రభాగాన సీపీఎం
కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ నాయకులు బాగం
హేమంత రావు, సీపీఎం
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా
నాగేశ్వరరావు, సీపీఐ
జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ , మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర రావు, టియుసిఐ నాయకులు కె.
రామయ్య,
కార్మిక
సంఘాల నేతలు నిలిచారు. ఈ -సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ మోడీ
కార్మిక,
రైతాంగ
వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను, మూడు నూతన సాగు
చట్టాలతో రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారని విమర్శించారు. కార్మికులకు
పని భద్రత లేకుండా చేయడంతో పాటు శ్రమ దోపిడీని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే
ప్రోత్సహిస్తుందని నేతలు ద్వజమెత్తారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని, ప్రశ్నించే వారిపై
ప్రభుత్వం జులుం చేస్తూ చట్టాలను ప్రయోగించి నిర్బంధించే ప్రయత్నం చేస్తుందని
ఆరోపించారు. -నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు స్వేచ్ఛ లేకుండా చేయడంతో పాటు పని
భారాన్ని పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగానికి సంబంధించి అమల్లోకి
వచ్చిన చట్టాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. సమ్మె -సందర్భంగా ప్రజల నుంచి
వచ్చిన మార్పును గమనించైనా నూతన సాగు చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లను రద్దు
చేయాలని డిమాండ్ చేశారు. -మోడీ ప్రభుత్వం మారక పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కె జానిమియా, మహ్మద్ సలాం, పోటు కళావతి, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వర రావు, -మిడికంటి చిన్నవెంకట రెడ్డి, మేకల శ్రీనివాస రావు, కళ్యాణం
వెంకటేశ్వరరావు, కొత్తా
సీతారాములు, మొక్కా
శేఖర్ గౌడ్, పాషా, నాగేశ్వరరావు, ఝాన్సీ తదితరులు
పాల్గొన్నారు.


Comments
Post a Comment