ప్రజల దృష్టి మళ్లించడానికే ... బనకచర్లపై రాద్దాంతం
- ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి విద్వేషం రెచ్చ గొట్టేలా వుంది
- హేతు బద్దంగా కృష్ణా, గోదావారి నికర, మిగులు జలాల పంపిణీ జరగాలి
- కేంద్ర జల సంఘం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించాలి
- సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
వాగ్దానాల అమలులో విఫలమవుతున్న కాంగ్రెస్, కుంభకోణాల నుండి ప్రజల దృష్టి
మళ్ళించడానికి బీఆర్ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రేకం . విద్వేషం రెచ్చగొట్టే
ప్రయత్నం చేస్తున్నాయని సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి
పోటు రంగారావు ఆరోపించారు. అందులో భాగంగానే బనకచర్ల, పోలవరం అనుసంధాన ప్రాజెక్టుపై
రాద్ధాంతం చేస్తున్నాని అన్నారు. ఈ రెండింటి మధ్య వివాదాన్ని పెంచి పెద్దది చేసి, పెద్దన్న పాత్ర పోషించి
లబ్ధి పొందాలని కేంద్రంలోని బీజేపీ
ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. గురువారం ఆయన ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన
కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పాలక, ప్రతిపక్ష పార్టీలు
రెచ్చగొట్టే ఎత్తుగడలను అర్థం చేసుకోవాలన, ఎటువంటి ఉద్రేకాలకు లోను
కావొద్దని కోరారు. ఒప్పందాలను ముఖ్యంగా నదీ జలాల సరిహద్దుల ఒప్పందాలను
శాస్త్రీయంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సమన్వయంతో, సుహృద్భావంతో మెంగాలని
సూచించారు. కృష్ణా, గోదావారి
నికర జలాల మీద హేతుబద్ధమైన పంపిణీ జరగాలన్నారు.
నదీ పరివాహ ప్రాంతం అవసరాలు దృష్టిలో వుంచుకుని బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేయాల్సి వుందన్నారు. అలాగే గోదావరి నికర జలాలు, మిగులు జలాల పంపిణీలలో
కూడా తగిన శాస్త్రీయ నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలన్నింటికి
వాటి వాటి అవసరాలను అనుగుణంగా పంపిణీ జరిగేలా కేంద్ర జల సంఘం రెండు రాష్ట్రాల
ప్రభుత్వాలను కూర్చోబెట్టి , జాష్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. అయితే, పాలకులు నీటి
రాజకీయాలను ఎన్నికలకు, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడు కోవడంసరైంది కాదన్నారు.
9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26,000
ఇవ్వాలని, ప్రభుత్వరంగ
సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని జూలై 9న కార్మిక, రైతు సంఘాల ఐక్యకా
ర్యాచరణ కమిటీ జరప తల పెట్టిన బందుకు సీపీఐ (ఎం. ఎల్) మాస్
లైన్ మద్దతు ఇస్తుందని పోటు రంగారావు
తెలిపారు. కార్మికులు, రైతులు బంధును విజయవంతం చేయాలని కోరారు. మీడియా
సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, సివై పుల్లయ్య, జి రామయ్య, ఆవుల అశోక్, కొల్లేటి నాగేశ్వర రావు, ఝాన్సీ, కే శ్రీను తదితరులు
పాల్గొన్నారు.

Comments
Post a Comment