ఖమ్మం నగరానికి ధీటుగా కూసుమంచి అభివృద్ధి
- 18 నెలల్లో పాలేరు నియోజకవర్గానికి రూ.1500 కోట్లు
- రూ. 5.5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణం
- రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం నగరానికి ధీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ను అభివృద్ధి
చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అన్నారు. గురువారం ఆయన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్
దురిశెట్టిలతో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు
శంకుస్థాపనలు చేసారు. రూ.36 లక్షలతో కూసుమంచి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ధర్మ తండా
వరకు చేపట్టిన రోడ్డు మరమత్తు పనులకు, రూ. 1.26 కోట్లతో లోక్యాతండా నుండి ధర్మతండా వరకు, రూ. 1.6 కోట్లతో లోక్యా
తండా నుండి అగ్రహారం వరకు చేపట్టిన రోడ్డు మరమ్మత్తు పనులకు, రూ. 2. 90 కోట్లతో కోక్యా తండా
నుండి వీర్యా తండా వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, రూ.3. 30 కోట్లతో గన్యా తండా
నుండి మోటాపురం వీరన్న స్వామి టెంపుల్ వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ
పనులకు,
కూసుమంచి
గ్రామంలో రూ. 6.50 కోట్లతో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులకు, కూసుమంచి, నేలకొండపల్లి రోడ్డులో
ఏర్పాటు చేయనున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. కోక్యా
తండాలో నిర్మాణంలో ఉన్న బాణోత్ సురేష్, భూమికల ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ
సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూసుమంచి, నేలకొండపల్లి మండల హెడ్
క్వార్టర్ లలో 6
కోట్ల 50 లక్షల రూపాయలతో
చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, జంక్షన్ అభివృద్ధి పనులు కొద్ది నెలల్లో పూర్తి
చేస్తామని, ఖమ్మం
నగరానికి ధీటుగా కూసుమంచి మండల హెడ్ క్వార్టర్ను తయారు చేస్తామని అన్నారు. కూసుమంచి
మండల హెడ్ క్వార్టర్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంతర్గత రోడ్లు నిర్మించామని, త్రాగు నీటి సరఫరా
సమస్యలు పరిష్కరించామని, 50 లక్షల రూపాయలతో షాదీ ఖానా మంజూరు చేశామని చెప్పారు. ప్రభుత్వ
జూనియర్ కళాశాలను సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో మంజూరు చేశామని, త్వరలోనే శంకుస్థాపన
చేస్తామన్నారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత 18 నెల్ల కాలంలో 1400 నుంచి 1500 కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు.
ప్రజల దీవెనలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఇంత అభివృద్ధి సాధ్యం
అవుతుందన్నారు. గత పాలకులు అమలు చేసిన సంక్షేమం పథకాలను కొనసాగిస్తూ 200 యూనిట్లు ఉచిత
విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల
జారీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ లో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జిలు
200 శాతం పెంపు, రైతులకు 21 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల రుణ మాఫీ పథకాలను
అమలు చేశామని వివరించారు. గత ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సహాయం ఎకరానికి 10 వేల రూపాయలు అందిస్తే, ప్రజా ప్రభుత్వం
రైతులకు అందించే సహాయం 12 వేలకు పెంచి, 9 రోజుల వ్యవధిలో దాదాపు 9 వేల కోట్ల రూపాయలను రైతు
భరోసా నిధులు జమ చేసామని అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి
స్థాయిలో ఇస్తున్నామన్నారు. రాబోయే మూడున్నర సంవత్సరాలలో మరో 3 విడతల్లో అర్హులైన పేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ
ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం
రెడ్డి,
జిల్లా
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక
అధికారి రమేష్, ఇర్రిగేషన్
ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఇఇ మిషన్ భగీరథ వాణిశ్రీ, హౌజింగ్ పిడి భూక్యా
శ్రీనివాస్, వ్యవసాయ
శాఖ సహాయ సంచాలకులు సరిత, విద్యుత్ శాఖ ఏడిఇ లోక్యా నాయక్, కూసుమంచి మండల తహసీల్దార్
రవికుమార్, ఎంపిడివో
వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment