ఎంపీ రేణుకా చౌదరిపై కేసు కొట్టి వేత

 

Renuka Chowdary

మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి కోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన ఎస్టీ ఎస్సీ ఎట్రాసిటీ కేసును ఖమ్మం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం శుక్రవారం కొట్టి వేసింది. 2014 లో భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో ప్రవేట్ కంప్లైంట్ వేశారు. ఆ కేసుపై ఖమ్మం జిల్లా కోర్టులోని  ఎస్సీ ,ఎస్టీ న్యాయస్థానం సాక్షులను విచారించి, నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రేణుక చౌదరి తరఫున సీనియర్ న్యాయవాదులు ఎం. నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు.


Comments

Popular Posts

యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

జర్నలిస్ట్ పాసులపై టోల్ టాక్స్, సెస్సులు తొలగించండి