వచ్చే ఏడాది ఖమ్మంలో రూ. 300 కోట్ల పనులు
- పేదలకు ప్రభుత్వ భూముల్లో కాలనీలు
- చేసిన పనులు జీవిత కాలం స్థిరంగా ఉండాలి
- నగరాన్ని పరిశుభ్రంగా వుంచడం ప్రతి ఒక్కరి బాధ్యత
- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం నగరానికి వచ్చే ఏడాది రూ. 200 నుంచి 300 కోట్లు అభివృద్ధి పనులు మంజూరు చేస్తామని రాష్ట్ర
వ్యవసాయ,
మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. గురువారం ఆయన ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు
నీరజ,
అదనపు
కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజలతో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
ఖానాపురంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగరంలో
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన సౌకర్యాల కల్పించడం, అభివృద్ధి చేయడం
పాలకుల బాధ్యతన్నారు. గతంలో వైయస్సార్ కాలనీలో పట్టాలు ఇస్తే, కొంత మంది అక్కడకు వెళ్లమని
చెప్పారని, నేడు
అదే ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడ మల్టీప్లెక్స్ లు కూడా వస్తున్నాయని అన్నారు.
బైపాస్ రోడ్డు వేసే సమయంలో ఇక్కడ ఎవరు లేరు, రోడ్డు ఎందుకని విమర్శించారని, నేడు ఆ రోడ్డు సరి
పోవడం లేదన్నారు. నగరంలో గుడిసెల్లో ఉంటూ అర్హులైన కటిక నిరు పేదలందరికీ మొదటి
దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మురికి కాల్వల వెంబడి బతకాల్సిన అవసరం
ప్రజలకు లేదని, భూమి
లేని నిరు పేదలకు ప్రభుత్వ భూముల్లో కాలనీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నగరాన్ని
పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఉద్భోధించారు. ప్రజల సహకారం వల్ల
ఖమ్మం నగరం పరిశుభ్రంగా ఉంటుందని, ఈ సహకారం మరింత కొనసాగించాలని మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం
నగరం ప్రజలకు మాత్రమే చెందుతుందని, కలెక్టర్, ఉన్నతాధికారులు, మంత్రులు మారుతూ ఉంటారని, ప్రజలు మాత్రం
తరతరాలుగా జీవిత కాలం ఇక్కడే నివసించాలి కాబట్టి, అందరం నగరాన్ని అద్భుతంగా
తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నగరంలో పరిసరాల పరిశుభ్రత, పచ్చని చెట్లు ఉండేలా చూడాలని, వీలైన చోట మొక్కలు
నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీఓ నరసింహా రావు, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ షఫీ ఉల్లా, మునిసిపల్ ఇంజినీరింగ్
ఖమ్మం డివిజన్ కార్య నిర్వాహక ఇంజనీర్ వి. రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్ తదితరులు
పాల్గొన్నారు.
పనుల ఆకస్మిక తనికీ ... రోడ్డు ప్రక్కన టీ
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర
రావు ఖమ్మం నగరంలో జరుగు తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, వరద నీటి కాల్వ, రోడ్డు వెడల్పు పనులను
ఆకస్మికంగా తనిఖీ చేశారు. లకారం చెరువు, అల్లిపురం రోడ్డు గంగమ్మ తల్లి టెంపుల్ వద్ద కూడా కాల్వ
పనులను పరిశీలించారు. గంగమ్మ తల్లి దేవాలయం వద్ద కాల్వ ఆక్రమణ జరిగిందని వచ్చిన
ఫిర్యాదుకు మేరకు, రెవెన్యూ
అధికారులు టోపో మ్యాప్ ప్రకారం ఆక్రమణలను చెక్ చేయాలని ఆదేశించారు. అనంతరం రైల్వే
స్టేషన్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, రోడ్డు విస్తరణలో
దుకాణాలు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల
రోడ్డు వెంట టీ స్టాల్లో స్నాక్స్ తీసుకొని టీ తాగారు.



Comments
Post a Comment