వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్ట బెట్టే ప్రయత్నం జరుగుతోంది
- ముక్త కంఠంతో పాలకుల ప్రయత్నాలను తిప్పి కొట్టాలి
- రైతు సంఘం మహాసభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపు
- సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మలీదు, కోలేటి ఎన్నిక
కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేసి, కార్పొరేట్లకు
భారతదేశ వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాలను రైతాంగం
ముక్త కంఠంతో వ్యతిరేకించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపు నిచ్చారు.
బుధవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రథమ సభ ఖమ్మంలోని రామ నరసయ్య విజ్ఞాన
కేంద్రంలో జరిగింది. ఈ సభలో గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశసంపదను
సామ్రాజ్యవాదులకు పంచి పెట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు
గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా కార్పోరేట్లు వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టారని, తమ లాభాల కోసం రైతన్న
లను వ్యవసాయ రంగం నుండి దూరం చేయటానికి రైతాంగ వ్యతిరేక చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు.
వాటిని వ్యతిరేకించిన రైతాంగంపై అమానుషంగా
దాడులు చేస్తున్నారని మండి పాడారు. ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీలను అమానుషంగా
చంపుతున్నారని ద్వజమెత్తారు. ఈ నేపధ్యంలో రైతాంగం
హక్కులతో పాటు దేశ ప్రజల హక్కుల కోసం కూడా పోరాడాల్సిన అవసరం వుందన్నారు. ఈ సభలో
అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ అధ్యక్షులు రంగయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు
గుర్రం అచ్చయ్య రైతాంగ సమస్యలపై ప్రసంగించారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా మలీదు
నాగేశ్వరరావు, ఒగ్గు
నాగిరెడ్డి వ్యవహరించారు. మహాసభ రైతాంగ సమస్యలపై 18 తీర్మానాలు ఆమోదించింది. అనంతరం
నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన
కార్యదర్శులుగా మలీదు నాగేశ్వర రావు, కోలేటి నాగేశ్వర రావు ఎన్నికైయ్యారు.

Comments
Post a Comment