అలెర్టుగా వుండండి ...

 

SP Rohith Raj

  • కంపెనీలకు ఎస్పీ రోహిత్ రాజు ఆదేశం
  • యజమానులు, భద్రతాధికారులతో సమావేశం

భారత్, -పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమల యజమానులు, భద్రతాధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. శుక్రవారం ఆయన అశ్వాపురం భారజల ఉత్పత్తి కేంద్రం, సారపాక ఐటిసీ, కేటీపీఎస్, బీటీపీఎస్, తదితర కంపెనీల భద్రతాధికారులు, సంబంధిత పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు ఆయా పరిశ్రమలు, కంపెనీలలో ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ, అందుకనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలారంపై కంపెనీల ఉద్యోగులకు, వారి కుటుంబాలకు, చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి అవగహన కలిగేందుకు ప్రాక్టీస్ చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పరిశ్రమల, కంపెనీల ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద ఇతర వ్యక్తులు లోనికి ప్రవేశించ కుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అదే విధంగా దొంగతనాలు జరగ కుండా తమ వంతు నిఘా ఏర్పాటు చేసుకుని పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నిషేదిత మావోయిస్టుల కార్యకలాపాల పట్ల కూడా నిఘా పెట్టాలనిఆదేశించారు. ఈ సమావేశంలో భారజల కేంద్రం కమాండెంట్ అమిత్ కుమార్, మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీఐలు వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి, ఐటిసీ సెక్యూరిటీ ఆఫీసర్ మనీష్ శర్మ, కేటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్, బీటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి