ఆ మహిళల కన్నీటి కెరటమే "ఆపరేషన్ సింధూర్
- బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటిసుధాకర్ రెడ్డి
- సైన్యానికి, మోడీకి ఆశీస్సుల కోసం సాయి బాబా గుడిలో యాగం
- మోడీ, భారత సైనికుల చిత్ర పటాలకు పాలాభిషేకం
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సిందూరాన్ని కోల్పోయిన ఆడపడుచుల కన్నీటి నుండి
రాలి పడిన కెరటమే "ఆపరేషన్ సిందూర్" అని భారతీయ జనతా పార్టీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జ్, మాజీ శాసన మండలి
సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన వైరా నియోజక వర్గ
కేంద్రంలోని కామిశెట్టి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుల గణన, జనగణన అవగాహన సదస్సుకు
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ముఖ్య
అతిధిగా హాజరయ్యారు. తొలుత వైరా పట్టణంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయాన్ని
సందర్శించారు. ఈ సందర్భంగా దేశ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర
మోడీతో పాటు, దేశ
రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ, ఆపరేషన్ సిందూర్ వంటి కార్యక్రమాలను
విజయవంతం చేస్తున్న సైనికులకు మనోధైర్యంతో పాటు, ఆశీస్సులు అందించాలని
ప్రత్యేకంగా యాగం నిర్వహించారు. అనంతరం వైరా అయ్యప్ప ఆలయంలో దేశ రక్షణ కోసం
దీవెనలు అందించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కామిశెట్టి ఫంక్షన్‌హాల్‌లో
పార్టీ నూతన మండల అధ్యక్షుడు మనుబోలు వెంకట క్రిష్ణ అధ్యక్షతన జరిగిన జనగణన, కుల గణన అవగాహన
సదస్సులో ప్రసంగించారు. దేశ పౌరుల జోలికొస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అనేలా
ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు ఉన్నాయని, ముఖ్యంగా పహల్గాం దాడి జరిగిన వారంలోనే ఆపరేషన్ సింధూర్
కార్యక్రమం నిర్వహించి, 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి దేశం సత్తా చాటారని మోడీ
ప్రభుత్వంతో పాటు, భారత
సైనికులను అభినందించారు. ముఖ్యంగా పహల్గాం దాడిలో హిందువులా ముస్లీంలా అని
గుర్తించి మరీ హత్యాకాండను కొనసాగించిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ చెంప పెట్టులాంటిదన్నారు.
పాకిస్తాన్‌తో పాటు ఆదేశానికి సహకరిస్తున్న చైనా, శ్రీలంక దేశాలు కూడా బుద్దిగా
ఉండాలని,
లేని పక్షంలో
తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం పార్టీ జిల్లా
అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ జనగణన, కులగణనలాంటి కార్యక్రమాలతో
పాటు,
ఆపరేషన్
సిందూర్‌లాంటి ప్రతీకార చర్యలకు కూడా భారత్ వెనుకాడబోదనే సంకేతాలు ప్రపంచ
వ్యాప్తంగా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, భారత సైన్యానికి కృతజ్ఞతలు
తెలిపారు. దేశ పౌరుల సంరక్షణ కోసం భారత రక్షణ శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు.
మోడీని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పార్టీ అభివృద్ధికి, దేశ సంరక్షణకు కృషి
చేయాలని పిలుపునిచ్చారు. తొలుత కామిశెట్టి కళ్యాణ మండపం వద్ద నరేంద్రమోడీ, భారత సైనికుల
చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం దేశ రక్షణ కోసం. సైనికుల సంక్షేమం కోసం
కృషి చేస్తామని పార్టీ శ్రేణులతో పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రమాణం చేయించారు.
జిల్లా నుండి నూతనంగా నియమితులైన 10 మండలాల అధ్యక్షులను ఈ సందర్భంగా పొంగులేటి
సుధాకర్ రెడ్డి, కోటేశ్వరరావులు
శాలువాలతో సత్కరించి, ఘనంగా
సన్మాంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నె ఉదయ్ ప్రతాప్, నున్నా రవి కుమార్, మందడపు సుబ్బారావు, అల్లిక అంజయ్య, దొడ్డా అరుణ, మణి, పమ్మి అనిత, వీరవెల్లి రాజేష్, నల్లగట్టు ప్రవీణ్, రవి రాథోడ్ తదితరులు
పాల్గొన్నారు.


Comments
Post a Comment