సీతారామ రివైజ్డ్ అంచనాలకు అనుమతులివ్వండి

 

Revanth Reddy

  • సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల విజ్ఞప్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రివైజుడు అంచనాల ప్రకారం అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదారాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసిన తుమ్మల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం సవరించిన అంచనాలు, పరిపాలనా ఆమోదం కోసం ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో వున్నాయని తెలిపారు. తక్షణమే రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పరిపాలన పరమైన అనుమతులతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి సాగు నీరు ఇచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాద్ జిల్లాలో సైతం గోదావరి జలాలు పరుగులు పెడుతాయని వివరించారు. అలాగే, గత సెప్టెంబర్ మాసంలో కురిసిన అకాల వర్షాల వల్ల పోటెత్తిన వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఎన్ఎస్పిఎల్ కాలువలు పలు చోట్ల గండి పడి దెబ్బ తిన్నాయని, వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న నెల రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు సాగు నీరు అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా వీటిని మరమ్మత్తులు చేయించాలని కోరారు.  

రహదారుల అభివృద్ధికి సహకరించండి

  • కేంద్ర మంత్రి గడ్కరికి తుమ్మల వినతి

ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఆయన కేంద్ర మంత్రి గడ్కరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధితో ప్రగతికి బాటలు పడుతాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరగడంతో పాటు ప్రధానంగా వాణిజ్య,  పర్యాటక రంగాలు విశేషంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ జాతీయ రహదారుల నిర్మాణంతో రాష్ట్రాల మధ్య దూరా భారం తగ్గుతుందని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు శర వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.


Nitin Gadkari

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి