ఉద్యోగులు ప్రతి పక్ష నేతలపై ఎదురు దాడి చేయాలి

 

Ponguleti Srinivas Reddy

  • ఉద్యోగ సంఘాలను ప్రధాన ప్రతి పక్షం రెచ్చగొడుతోంది
  • ఎనిదో వింతని కట్టిన కాళేశ్వరం కూలి పోయింది
  • రాష్ట్ర అప్పులను ప్రజలకు చెప్పకుండ ఎలా వుంటాం ?
  • సీఎం అనని దాన్ని అన్నట్లు ప్రతి పక్షం ప్రచారం చేస్తోంది
  • రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఉద్యోగ సంఘాలను ప్రధాన ప్రతి పక్షం రెచ్చగొడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండి పడ్డారు. ఉద్యోగులు వారిపై ఎదురు దాడి చేయాలని, రాష్ట్రం చల్లగా ఉండాలనుకునే వారు కూడా ప్రతి పక్ష నేతల విమర్శలను తిప్పి కొట్టాలని కోరారు. మంగళవారం ఆయన కూసుమంచిలో జరిగిన పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనని దాన్ని అన్నట్లు ప్రతి పక్షం ప్రచారం చేస్తోందని, రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్రాన్ని చిన్న బుచ్చినట్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పడం ఇందిరమ్మ ప్రభుత్వానికి రాదన్నారు. రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పక పోతే ప్రజలను మోసం చేసినట్లు అవుతుందన్నారు. గత ప్రభుత్వం దొరికింత వడ్డీకి రూ. 8.19 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రం మీద గుది బండ మోపిందని దుయ్య బట్టారు. పది సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని కొల్ల గొట్టారని, వారు చేసిన అప్పులు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి పక్ష నేతలు నిజాన్ని కప్పి పుచ్చి ప్రజలను ప్రక్క దారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఎనిమిదో వింతని చెప్పిన కాళేశ్వరం, లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడితే కూలి పోయిందని, దాన్ని ప్రజలకు చెప్పకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. అబద్ధాలను నిజాలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. మీరు చేసిన అప్పు మీ ఘన కార్యమే, దాన్ని తమ ఖాతాలో వేసు కోమన్నారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల బాగోగుల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.

ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొంటాం

రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానిని ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా వుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశామన్నారు. 25 లక్షల 60 వేల మంది రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గనికి 3,500 ఇళ్ళు ఇస్తున్నామని తెలిపారు. పదేళ్ళలో మీరు చేయ లేనివి 16 నెలల్లో మేము చేసి చూపించామని, ఇందిరమ్మ ప్రభుత్వంలో భూభారతి చట్టం తీసుకొచ్చి రైతులకు అండగా ఉన్నామని పేర్కొన్నారు. వరంగల్ సభను ఆపాలని ఇందిరమ్మ ప్రభుత్వం చూసిందని చెపుతున్నారు, తాము అపాలనుకుంటే బస్సులు ఎందుకు ఇస్తామన్నారు. అసలు ఖమ్మంలో రాహుల్ గాంధీ సభను అడ్డుకుంది మీరంటూ బీఆర్ఎస్ నేతలపై ద్వజ మెత్తారు.

పదవుల కోసం పార్టీ ఫార్మెట్లో బయోడేటా ఇవ్వండి

 పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు పార్టీ పార్మట్ లో బయోడేట ఇవ్వాలని మంత్రి పొంగులేటి కోరారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద వట వృక్షమని, ఆ చెట్టు కింద ఎన్ని కోట్ల మందైనా సేద తీర్చు కోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎత్తు పల్లాలు సహజమని, ప్రాంతీయ పార్టీలలే తారాజువ్వల్లా ఎగిరి కింద పడతాయన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీలో పని చేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటామని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జాతీయ, రాష్ట్ర నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు.

పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన

అంతకు ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేలపట్ల ఎస్సీ కాలనీలో రూ. 24 లక్షలతో, మల్లేపల్లి ఎస్సీ కాలనీలో రూ. 36 లక్షలతో, జక్కేపల్లి ఎస్సీ కాలనీలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, రూ.15 కోట్ల అంచనా వ్యయంతో పాలేరు పట్టణ పరిధిలో సూర్యాపేట- అశ్వరావుపేట రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, ఇర్రిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహా రావు, ఏడిఏ సరిత, కూసుమంచి మండల తహశీల్దార్లు కరుణశ్రీ, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Ponguleti srinivas Reddy

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి