జమిలి ఎన్నికలతో జీడీపీలో 2 శాతం ఖర్చు తగ్గుతుంది

 

రఘునంధన్ రావు

  • బీజేపీ నేత, పార్లమెంటు సభ్యులు రఘు నందన్‌ రావు

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే, దేశ జీడీపీలో 2శాతం మేర ఖర్చు తగ్గుతుందని, తద్వారా దేశ ప్రజల సంక్షేమానికి, ఆకలి తీర్చడానికి అవకాశం దక్కుతుందని బీజేపీ నేత, మెదక్‌ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఖమ్మం లో వన్‌ నేషన్‌`వన్‌ ఎలక్షన్‌ అనే అంశంపై భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆద్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు రఘునందన్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ మీద ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని, ఒకే సారి ఎన్నికలు జరిగే ప్రభుత్వం కూలి పోతే ఎలా ? అని కొందరు, గెలిచిన వారు చని పోతే ఎలా ? అని మరి కొందరు ప్రశ్నిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు తప్ప అందులో వాస్తవం ఎంత అనేది ప్రజలు గుర్తించాలని కోరారు. నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌, అహింసను ప్రేరేపిస్తూ పబ్బం గడుపుతుందని, లెఫ్ట్‌ పార్టీలకు దేశ ప్రజలు ఇప్పటికే మంగళం పాడారని, తెలంగాణ వ్యాప్తంగా ఒక సీటుకి పరిమితం చేసి కమ్యూనిస్టులను లెఫ్ట్‌ చేశారని ఎద్దేవా చేశారు. ఇక రైట్‌వేలో ముందుకు పోతున్నది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ జెండా రెపరెపలాడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక మొన్న జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌తో పాటు భారత ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నామని ప్రగల్భాలు పలికే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలోని మదర్సాల్లో తలదాచుకున్న పాక్‌ మద్ధతుదారులను, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల నుండి అక్రమంగా తెలంగాణలో నివసిస్తున్న వారిని రాష్ట్ర పొలి మేరలు దాటించినప్పుడు మాత్రమే దేశానికి మద్ధతు ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు  దేవకి వాసుదేవ రావు, ఉదయ ప్రతాప్, దొంగల సత్యనారాయణ, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వరావు, నున్న రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి