క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై నిఘా పెట్టండి

SP Rohith Raju


  • బాధితులకు న్యాయం చేయడంలో బాధ్యతగా వ్యవహరించాలి
  • విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమ శిక్షణా చర్యలు తప్పవు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు

క్రికెట్ బెట్టింగులు, ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా, ఇతర సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా పోలీస్ అధికార్లను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోలీసు అధికార్లతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మార్చిలో విధుల పట్ల అంకిత భావంతో పని చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేసే విధంగా సమగ్ర విచారణ చేపట్టి, నేరస్తులకు శిక్ష పడేలా పని చేయాలని సూచించారు. న్యాయాధికారులతో సమన్వయం చేసుకుంటూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలబడాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని దొంగతనాల నివారణకై ప్రజలను అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. సామాన్య  ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించారాదని, మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారికి నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.


Bhadradri Kothagudem Police




Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి