దేశాన్ని ఆర్దికంగా దెబ్బ తీస్తున్న మోడీ విధానాలు

Nunna Nageswra Rao


  • సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు

నూతన ఆర్థిక విధానాలు ఫలితంగానే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు  విమర్శించారు. శనివారం సుందరయ్య భవన్లో పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందు గా అమరజీవి యర్రా శ్రీకాంత్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు సంస్కరణలను వేగవంతంగా మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ నూతన సంస్కరణలు ఫలితంగా పెట్రోల్ , డీజిల్,  గ్యాస్ , ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. హిందువులు పేరుతో మత రాజకీయాలు చేస్తూ హిందువులపై అదనపు ఆర్థిక భారాలు మోపడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యకుండా నిత్యం మతాల మధ్య చిచ్చు పెట్టే పనిలో పడిందన్నారు. దేని వల్ల మతోన్మాదం పెరిగి దేశం అంతా అల్లకల్లోలం కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ , ఆర్ఎస్ఎస్ రెండు కవలు పిల్లలని, ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు మైనార్టీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మనిషి ఏమి తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో బిజెపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక పక్క నూతన ఆర్థిక విధానాలతో దేశంలో సంక్షోభం ఏర్పడిందని, మరో వైపు ప్రజలు ఉద్యమాల్లోకీ రాకుండా మతాన్ని ముందుకు తెచ్చి దేశ ప్రజలతో బిజెపి నేతలు ఆటలు ఆడుతున్నారని ధ్వజ మెత్తారు. రాబోయే కాలంలో మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరగబోయే ప్రజా ఆందోళనలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో వున్న ప్రజా సమస్యలపై రాబోయే కాలంలో పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై విక్రమ్, నాయకులు ఎంఏ జబ్బర్,  దొంగల తిరుపతి రావు, మీరా సాహిబ్, బోడపట్ల సుదర్శన్, నాగులు మీరా, ఇమామ్, బద్రం, జె వెంకన్న బాబు, కె శ్రీనువాసురావు, బేగం , కుమార్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి