ఏసీబీకి పట్టు బడ్డ మణుగూరు సీఐ సతీష్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం మరో పోలీస్ అధికారి ఏసీబీకి
చిక్కాడు. మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరించిన ఓ టీవీ చానెల్ రిపోర్టర్
మిట్టపల్లి గోపీని ఏసీబీ డీఎస్పీ రమేష్ అరెస్టు చేశారు. మణుగూరు పోలీస్ స్టేషన్లో
ఇటీవల ఒక కేసు (150/2025 ) నమోదైంది. ) బీఎన్ఎస్ సెక్షన్లు 318(4), 329(3), తెలంగాణ స్టేట్
గేమింగ్ (సవరణ) చట్టం, సెక్షన్ 5 క్రింద నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారులకు
పూర్తిగా సహకరించేందుకు సీఐ సోమ సతీష్ కుమార్ రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రిపోర్టర్
గోపీ మధ్యవర్తిత్వంతో ఈ మొత్తాన్ని బాధితులు దశల వారీగా ఇచ్చేందుకు ఒప్పందం
కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా గోపీ బాధితుల నుండి లక్ష రూపాయలు తీసుకోగా, అందిన ఫిర్యాదు మేరకు, ఖమ్మం ఏసీబీ డీఎస్పీ
రమేశ్ తన సిబ్బందితో గోపీని వల పన్ని పట్టుకున్నారు.
రసాయన పరీక్షల ద్వారా డబ్బులపై వేలి ముద్రలు గుర్తించి కేసు నమోదు చేశారు. సీఐ
సతీష్ కుమార్ ఆదేశం మేరకే రిపోర్టర్ గోపి ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించాడని
నిర్ధారణ కావడంతో గోపీతో పాటు సీఐ సీఐ సతీష్ కుమార్ ను అరెస్ట్ చేసి వారంగల్
ఎస్పీఈ మరియు ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఏ1 గా సీఐ సతీష్ కుమార్ ను, ఏ2 గా మిట్టపల్లి
గోపీని చేర్చారు.

Comments
Post a Comment