ధంసలా పురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయండి
- రైల్యే జీఎంకు ఎంపీ రఘురాం రెడ్డి వినతి
ఖమ్మం నగరంలోని ధంసలా పురం వద్ద ( గేట్ నెంబర్ 106 ) పెండింగులో వున్న రైల్యే అండర్
బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం
రెడ్డి,
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ను కోరారు. బుధవారం
జీఎంను కలిసిన ఎంపీ, గత
కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్మాణం పెండింగ్లో ఉండటం వల్ల స్థానిక రైతులు, పరిసర గ్రామ ప్రజలు ఇబ్బంది
పడుతున్నారని తెలిపారు. త్వరిత గతిన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు.
వెంటనే స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ సంబంధిత చీఫ్ ఇంజనీర్, తదితర అధికారులతో
మాట్లాడి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. అనంతరం ఇంతక ముందు ప్రతిపాదించిన
డోర్నకల్ -మిర్యాలగూడెం, డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చి డోర్నకల్,- వెన్నారం, మరిపెడ, మోతే మీదుగా రూపొందించిన
ప్రతిపాదనలపై పై చర్చించారు. అలాగే, రద్దు చేసిన రైళ్లను తిరిగి పున:రుద్దరించాలని, ఖమ్మం, బోనకల్, ఎర్రుపాలెం, డోర్నకల్ నుండి
భద్రాచలం రోడ్డు వెళ్ళే మార్గంలో గాంధీనగర్ స్టేషన్లో రైళ్లను ఆపాలని రైల్వే జీఎంని ఎంపీ రఘురాం రెడ్డి
ఈ సందర్భంగా కోరారు.

Comments
Post a Comment