పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉద్రిక్తత

 

Peddamma Thalli Temple, Palvancha

  • కేశవా పురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల ఆత్మహత్యా యత్నం
  • ఆలయ పాలక మండలిలో చోటు దక్కక పోవడంతో నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుండగా కేశవా పురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలిలో కేశవా పురం గ్రామస్తులకు చోటు కల్పించక పోవడాన్ని నిరసిస్తూ వారు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు.గ్రామస్తులతో కలిసి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకొనేందుకు ఆలయంలోకి చొచ్చుకెళ్లారు. అక్కడే వున్న పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇటీవల వీరిద్దరు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలపడంతో ప్రమాణ స్వీకారం ఒక సారి వాయిదా పడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుడు జమ్ముల రాజశేఖర్‌ ను ఆలయ పాలక మండలి చైర్మెన్ గా నియమించారు. దీంతో మంత్రి పొంగులేటి అనుచరులు కూడా ప్రయత్నం చేసి పాలక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. అయితే, పెద్దమ్మ తల్లి ఆలయ పాలక మండలిలో స్థానికులైన కేశవా పురం గ్రామస్తులకు చోటు దక్కక పోవడంతో కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే, ఈ రోజు కూడా ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుండగా అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

Comments

Popular Posts

యస్.బి.ఐ.టి. సహాయ ఆచార్యులు జి. ప్రభాకర్ కు డాక్టరేట్

చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు ... రక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశం

జర్నలిస్ట్ పాసులపై టోల్ టాక్స్, సెస్సులు తొలగించండి