సీఎం సహాయ నిధిలో కోతలు తగదు

MLC Thatha Madhu


  • ఎమ్మెల్సీ, బీయర్ఎస్ ఖమ్మ జిల్లా అధ్యక్షులు తాతా మధు సూదన్
  • 65 మందికి రూ. 17.44 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ    

నిరుపేదలకు అందించే సీఎం సహాయ నిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధించడం విచారకరమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు సూదన్ అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయం ప్రగతి భవన్లో రూ. 17,44,000 విలువ చేసే 65 చెక్కులకు ఆయన లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా తాతా మధు సూదన్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధిలో కోతలు పెట్టొద్దని, ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం పేదలు ఎంత ఖర్చు చేసినా 60 వేల రూపాయలే అందిస్తున్నారని, అలా కాకుండా  సీఎం సహాయ నిధి పంపిణీలో హూందాగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. కానీ, ప్రభుత్వ తీరు మాత్రం మారలేదని తాతా మధు సూదన్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకు సీఎం ముందస్తు సహాయ నిధి, సీఎం సహాయ నిధి ‌ ద్వారా ఎంత ఖర్చైతే అంత అందించే ప్రయత్నం చేశామన్నారు. నేడు పేదలకు లక్షల రూపాయలు ఖర్చైనా కేవలం 60, 000 రూపాయలు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడం కోసం హామీలను ప్రజలకు ఏర వేసి, ప్రజలకు మోసం చేసి 420 గా నిలిచారని విమర్శించారు. కేసీఆర్ సంక్షేమ పాలనకు, కాంగ్రెస్ రాక్షస పాలనకు ఉన్న తేడాను ప్రజలు తెలుసుకున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి సొంత గ్రామాల్లోకి వెళ్లలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నాయకులు భాష బోయిన వీరన్న, పెనుబల్లి మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట రావు, మధిర మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, మధిర నగర పార్టీ అధ్యక్షులు కరుమూరి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిపి సామినేని హరి ప్రసాద్, నాయకులు పోట్ల శ్రీనివాస్, బంక మల్లయ్య, తాతా ప్రసాద్, పేరం వెంకటేశ్వర్లు, ఉద్యమకారులు పగడాల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Comments