రాలిన 'పద్మం'
- ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె పోటుతో రామయ్య మృతి
- అకుంటిత దీక్షతో కోటికి పైగా మొక్కలు నాటిన వన జీవి
- 2017లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు
- ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం
ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ( 85 ) కన్ను మూశారు.
శనివారం తెల్లవారు జామున ఆయన ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె పోటుతో తుది శ్వాస
విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రామయ్య ఇంట్లో స్పృహ తప్పి పోవడంతో
వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆర్ఎంపీ వద్దకు, ఆతర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి
తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ రామయ్య మరణించారు. ఆయన మృతి పట్ల మాజీ ఉప
రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్ర బాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్
రెడ్డి,
తెలంగాణ మంత్రులు
తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతాపం ప్రకటించారు. రామయ్య కుటుంబ
సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మొక్కలు పెంచడంలో రామయ్య కృషి అందరికీ స్పూర్తి
దాయకమని పేర్కొన్నారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణకు తీరని లోటన్నారు.
రామయ్య నేపధ్యం
వన జీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికయ్యాడు.
2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.1995
లో తొలి సారి ఆయనను ‘కృషి
సేవ’ అవార్డు వరించింది. 2005
లో వనమిత్ర, 2015 లో జాతీయ ఆవిష్కరణలు
మరియు అత్యుత్తమ సాంప్రదాయ జ్ఞాన అవార్డులు దక్కాయి. ఆయన నిరాడంబర జీవితపై ‘విత్తనం నుండి పద్మం
వరకు -వనజీవి ప్రయాణం’ అనే పుస్తకం కూడా వెలువడింది. ఎటు వంటి లాభాపేక్ష లేకుండా రామయ్య చేసిన నిశ్వార్ధ సేవ పలువురికి ఆదర్శవంతమైంది.



Comments
Post a Comment