సీపీఎం నేత యర్రా శ్రీకాంత్ గుండె పోటుతో మృతి

Yerra Srikanth


  •    మదురై పార్టీ జాతీయ మహా సభలకు వెళ్ళి హఠాన్మరణం

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ (62) ఆదివారం మధ్యాహ్నం తీవ్రమైన గుండె పోటుతో మధురైలో మరణించారు. పార్టీ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు ప్రతినిధిగా వెళ్ళిన ఆయన శనివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురి కావడంతో మధురైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక కోలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ ఆకస్మిక మృతి పట్ల సీపీఎం శ్రేణులతో పాటు వివిధ రాజకీయ పార్టీ, ప్రజా, కార్మిక సంఘాలు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ఖమ్మం పట్టణంలో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించి, విద్యార్థి దశలో ఎస్.ఎఫ్.ఐ. వైపు ఆకర్షితుడై విద్యార్ధి, యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గత 37 సంవత్సరాలుగా కార్మికోద్యమంలో పని చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ వరకు చదివిన శ్రీకాంత్ 1980 లో సీపీఎంలో చేరి 1991 నుండి పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తున్నారు. శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య కూడా ఖమ్మం పట్టణ ఐద్వా నాయకురాలిగా సేవలందిస్తున్నారు. రెండు సార్లు ఖమ్మం మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ఎన్నికై ఆమె, భర్త బాటలోనే  ప్రజా సేవ చేస్తున్నారు. శ్రీకాంత్ 1982 నుండి -84 వరకు ఎస్.ఎఫ్.ఐ.లో పనిచేశారు. 1991 నుండి సీపీఎం పూర్తి కాలం కార్యకర్తగా పని చేస్తూ 1995 లో సి.ఐ.టి.యు. ఖమ్మం పట్టణ కార్యదర్శిగా, 2002 లో పార్టీ ఖమ్మం టౌన్ కార్యదర్శిగా, 2009 లో పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా, 2011 లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2019 లో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులుగా మొదటి సారిగా ఎన్నికై,  తిరిగి 2021, 2025 లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో కూడా రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు.  శ్రీకాంత్ మృతికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాతా మధు సూదన్, సీపీఐ నేత భాగం హేమంత రావు సంతాపం తెలిపారు. మధురైలో శ్రీకాంత్ పార్థివ దేహానికి పార్టీ అగ్ర నేతలు తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ, వీరయ్య , జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు తదితరులు నివాళులర్పించారు.  శ్రీకాంత్ పార్థివ దేహం సోమవారం ఉదయం ఖమ్మం నగరానికి తీసుకురానున్నారు.

Yerra Srikanth



Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి