దిశా ... నిర్ధేశం
- స్థానిక సంస్థల ఎన్నికలపై ఖమ్మం క్యాడరును అలెర్ట్ చేసిన కేటీఆర్
- హైదారాబాద్ లోని పువ్వాడ అజయ్ ఇంట్లో అనూహ్యంగా విందు మీటింగ్
- త్వరలో ఖమ్మంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఖమ్మం జిల్లా పార్టీ క్యాడరుకు దిశా నిర్ధేశం చేశారు. ఈ
నెల 15
లోగా
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎలువడే అవకాశం వుండడంతో హైదారాబాద్ లోని
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఇటీవల పువ్వాడ అజయ్ కుమార్ అక్కడ స్వంత ఇల్లు కట్టు కొని గృహ ప్రవేశం చేయడం, నిన్న పువ్వాడ పెళ్లి
రోజు కూడా కావడంతో మంగళ వారం పువ్వాడ ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ కు విందు ఏర్పాటు
చేశారు. ఈ విందుకి హాజరైన కేటీఆర్ అక్కడే భారీగా తరలి వచ్చిన పార్టీ క్యాడర్ తో అనూహ్యంగా
సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలని
ఉద్భోధించారు. కాంగ్రెస్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు బెదిరిస్తారని, వారి బెదిరింపులకు
బయపడ కుండా ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇచ్చిన హామీలను అమలు చేయడంతో ఘోరంగా విఫలమైందని, అన్ని వర్గాలల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని
అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు పోయి విజయ ఢంకా మ్రోగించాలని
సూచించారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల
నాగేశ్వర రావు,
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య సఖ్యత లేదని, ఇదే అదునుగా కష్ట పడి పని
చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఖాయమని చెప్పారు. త్వరలో ఖమ్మలో మరో
సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని అంశాలపై కూలంకుశంగా చర్చిద్దామన్నారు. ఈ
సమావేశానికి మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ డీసీసీబీ
అధ్యక్షులు కూరాకుల నాగభూషణం, మాజీ సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్
ఆర్జేసీ కృష్ణ, మున్సిపల్
కార్పొరేషన్ ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డీప్యూటీ ప్లోర్ లీడర్
మక్బుల్, ఖమ్మం నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు రామ్మూర్తి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, వీరు నాయక్, 23 మంది ఖమ్మం కార్పొరేటర్లు
హాజరయ్యారు.
Comments
Post a Comment