తెలంగాణలో తొలి నీలి చెవుల లకుముకి పిట్ట

Blue eared kingfisher



  • ఖమ్మం కనక గిరి అడవుల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
  • దర్శనమిచ్చిన 65 పక్షి జాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులు
  • 12 గంటలు నడచి కనుగొన్న 12 మంది సభ్యుల బృందం  

తెలంగాణలో తొలి సారి నీలి చెవుల లకుముకి పిట్ట(  బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ) దర్శన మిచ్చింది. ఖమ్మం జిల్లాలోని కనక గిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మాహాద్భుత ఘట్టాన్ని 12 మంది సభ్యులు గల ప్రకృతి ప్రేమికుల బృందం రికార్డ్ చేసింది. బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ను తెలంగాణలో రికార్డు చేయడం ఇదే తొలి సారి. అంతే కాకుండా రాష్ట్రంలోనే మొదట సారి గొప్ప జీవ వైవిధ్యాన్ని ఇక్కడ కనుగొన్నారు. అద్భుతమైన వృక్ష, జంతు జాలం ఈ ఫారెస్టులో కను విందు చేస్తోంది. 65 పక్షి జాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులు ఇక్కడ ఉన్నట్లు గుర్తించారు.  ప్రదీప్ ప్రజ్ ( వైల్డ్ తెలంగాణ ), నవీన్ బాలా, సుజీత్ ఎ (మెరాకి ఆర్గనైజేషన్), హరికృష్ణ పి (విడబ్ల్యూఓఎల్ఎఫ్ ఫౌండేషన్), జె రమేష్ తో పాటు12 మంది ప్రకృతి ప్రేమికులు సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కనక గిరి రిజర్వ్ ఫారెస్టులో ఆదివారం నుండి 12 గంటల సంచరించారు. దట్టమైన అడవిలో 4 కిలోమీటర్లు నడచి ఈ అద్భుతమైన వృక్ష, జంతు జాలాన్ని కనుగొన్నారు. తెలంగాణలో మొట్ట మొదటి సారి నీలిచెవుల లకుముకి పిట్ట( బ్లూ- ఇయర్డ్ కింగ్‌ఫిషర్‌ ) ను చూశారు. ఈ నడకలో బ్లాక్- వింగ్డ్ పైక్, రూఫస్ వుడ్ పెకర్, వైట్ రంప్డ్ మునియా, బ్లూ-థ్రోటెడ్ బ్లూ ఫ్రై క్యాచర్, బ్లాక్-రంప్డ్ షామా తారస పడ్డాయి. మలబార్ జెయింట్ స్క్విరెల్ సహా వివిధ రకాల క్షీరదాలను కూడా గమనించారు. ఈ బృందం వన్య ప్రాణులపై విలువైన డేటాను సేకరించడమే కాకుండా, కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ ఉత్కంఠ భరితమైన భూభాగాలను, అద్భుతమైన దృశ్యాలను చూసి తరించింది.రానున్న కాలంలో ఇక్కడ మరిన్ని అధ్యనాలు జరిగే అవకాశం వుంది. పరిశీలకులకు, ప్రకృతి ప్రియులకు స్వర్గదామంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.  

Janechcha

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు