తెలంగాణలో తొలి నీలి చెవుల లకుముకి పిట్ట

ఖమ్మం కనక గిరి అడవుల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతం దర్శనమిచ్చిన 65 పక్షి జాతులు , 5 క్షీరద జాతులు , 5 చేప జాతులు 12 గంటలు నడచి కనుగొన్న 12 మంది సభ్యుల బృందం తెలంగాణలో తొలి సారి నీలి చెవుల లకుముకి పిట్ట ( బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ) దర్శన మిచ్చింది. ఖమ్మం జిల్లాలోని కనక గిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మాహాద్భుత ఘట్టాన్ని 12 మంది సభ్యులు గల ప్రకృతి ప్రేమికుల బృందం రికార్డ్ చేసింది. బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ ను తెలంగాణలో రికార్డు చేయడం ఇదే తొలి సారి. అంతే కాకుండా రాష్ట్రంలోనే మొదట సారి ఓ గొప్ప జీవ వైవిధ్యాన్ని ఇక్కడ కనుగొన్నారు. అద్భుతమైన వృక్ష , జంతు జాలం ఈ ఫారెస్టులో కను విందు చేస్తోంది. 65 పక్షి జాతులు , 5 క్షీరద జాతులు , 5 చేప జాతులు ఇక్కడ ఉన్నట్లు గుర్తించారు. ప్రదీప్ ప్రజ్ ( వైల్డ్ తెలంగాణ ) , నవీన్ బాలా , సుజీత్ ఎ (మెరాకి ఆర్గనైజేషన్) , హరికృష్ణ పి (విడబ్ల్యూఓఎల్ఎఫ్ ఫౌండేషన్) , జె రమేష్ తో పాటు12 మంది ప్రకృతి ప్రేమికులు సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కనక గిరి రిజర్వ్ ఫారెస్టులో ఆదివారం నుండి 12 గంటల సంచరించారు. దట్టమైన అడవిలో 4 ...