రెండవ ప్రాధాన్యతే ... కీలకం


ఉమ్మడి ఖమ్మ, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభధుల నియోజక వర్గ ఎం‌.ఎల్‌.సి ఎన్నికలు చెదురు మొదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఓటర్లలో 72.37 శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఓట్లను మాత్రం జూన్ 5న లెక్కిస్తారు. ఆ తరువాత ఎవరు గెలిచారన్నది తేలడానికి రెండు, మూడు రోజులు పట్టోచ్చు. ఈ ఓట్ల లెక్కింపు అన్నది ఒక సుధీర్ఘమైన ప్రక్రియ . ఓట్లు వేసే పద్దతిలోనూ ... లెక్కించే విధానంలోనూ ... సాధారణ ఎన్నికలతో పోలిస్తే ... చాలా తేడా వుంటుంది. అందుకే ఈ ఎన్నికలకు ఈవీఏంలు కాకుండా బ్యాలెట్లు వాడారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికలోనూ ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధినే విజేతగా ప్రకటిస్తారు.

కానీ ...  ఆ అభ్యర్ధికి పోలైన ఓట్లలో 50 శాతం కన్నాఒక్క ఓటైనా ఎక్కువ రావాలి. అంటే ... పోలైన ఓట్లలో సగం ఓట్లు వచ్చినా సరిపోదు అదనంగా మరో ఓటు రావాలి. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఒకే. నాకు తెలిసి ... కేవలం మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ... అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనూ లేరు. అందరూ 2వ ప్రాధాన్యతా ఓట్లు కలపడం వల్లనే గెలిచారు. ఎందుకంటే ... సాధారణంగా ఏ ఒక్క అభ్యర్ధికీ మొదటి ప్రాధాన్యతా ఓట్లు సగం కన్నా ఎక్కువ రావు. 2, 3 ప్రాధాన్యతా ఓట్లను కలపాల్సి వస్తుంది. ఇప్పటివరకూ ... ఏ ఎన్నికలోనూ 3వ ప్రాధాన్యతా ఓట్లను కూడా కలపాల్సి రాలేదు. 2వ ప్రాధాన్యతా ఓట్లను కలిపే సరికే 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవి. ఆ అభ్యర్ధిని విజేతగా ప్రకటించే వారు. అందుకే ... ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా 2వ ప్రాధాన్యతా ఒట్లే కీలకం.

చాలా మందికి ఈ ఓట్లు లెక్కించే పద్దతి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ... టెక్నికల్ గా కాకుండా ... సరళంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొదట పోలైన ఓట్లను అన్నీ కలిపి 50 ఓట్ల చొప్పున కట్టాలు కడతారు. ఆ తర్వాత ... మొదటి రౌండ్లో ... మొదటి ప్రాధాన్యతా ఓట్లు ఏ ఏ అభ్యర్ధికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు.  మొదటి ప్రాధాన్యతా ఓట్లు ఏ అభ్యర్ధికైనా పోలైన ఓట్లలో 50 శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యతా ఓట్లు ... ఎవరికీ 50 శాతం కన్నా ఎక్కువ రాకపోతే ... రెండవ రౌండ్లో రెండవ ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. వీటిని ఎలా లెక్కిస్తారంటే ... మొత్తం అభ్యర్ధుల్లో మొదటి ప్రాధాన్యతా ఓట్లు అందరికన్నా తక్కువ వచ్చిన అభ్యర్ధిని ఎలిమినేట్ చేసి ... అతనికి మొదటి రౌండ్లో వచ్చిన ఓట్లలో 2వ ప్రాధాన్యతా ఓట్లు లెక్కించి ... మిగిలిన అభ్యర్ధులకు ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో .. వాటిని ఆయా అభ్యర్ధుల మొదటి ప్రాధాన్యతా ఓట్లకు కలుపు తారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు