పొంగులేటిపై లేఖాస్త్రం
తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఓ లేఖ విడుదలైంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈ లేఖను విడుదల చేశారన్న భావన కలిగేలా ఈ లేఖను డ్రాఫ్ట్ చేశారు. లేఖ చివర ఏడుగురి పేర్లున్నా ... సంతకాలు మాత్రం చేయలేదు. కంప్యూటర్ లో కొంపోస్ చేసిన లేఖను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజ స్వరూపం చూడండంటూ విడుదల చేశారు. ఈ లేఖ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై పొంగులేటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతను కమ్మ వాళ్ళకు వ్యతిరేకం అంటూ లేఖను ప్రారంభించి ... కమ్మ వాళ్ళ సత్తా నిరూపించి నిలబడదాం ... కలబడదాం అంటూ ముగించారు. మధ్యలో పొంగులేటిపై తీవ్రమైన విమర్శలు ... ఆరోపణలు చేశారు. 1995లో కల్లూరులో పాలమ్ముకొనే వాడని ... మొదట తుమ్మల లక్ష రూపాయల కాంట్రాక్టు ఇచ్చాడని రాసుకొచ్చారు.
నామ నాగేశ్వర రావు 60
యేళ్ళు సంపాదించలేనిది ... పదేళ్ళలో పదివేల కోట్లు అక్రమంగా సంపాదించాడని
ఆరోపించారు. రానున్న ఇదేళ్లలో ఆర్ఆర్ఆర్ ప్రక్కనవెయ్యి ఎకరాలు, 2 లక్షల కోట్లు మింగడానికి సిద్దమైండని
ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పదవుల్లో కమ్మ వాళ్ళను లేకుండా
చేశాడని ... ఇప్పటికీ ఇతను జగన్ ఏజెంటని విమర్శించారు. తుమ్మల మచ్చలేని నాయకుడని
... తాను తలచుకుంటే ఈ 45 యేళ్లలో 3 లక్షల కోట్లు సంపాదించి ... ముఖ్యమంత్రి అయ్యేవాడని
పేర్కొనారు. ఇంకా ... పొంగులేటి చేసే దాన ధర్మాలపైనా ... కమ్మ సామాజిక వర్గానికి
చెందిన తన అనుచరులకు ఆయన ఇచ్చే గౌరవంపైనా ... పలు విమర్శలు చేశారు. అయితే ...
దీనిపై పొంగులేటి ఇంకా స్పందించలేదు.
Comments
Post a Comment