కాంగ్రెస్ కు ఓటు తో బుద్ది చెప్పాలి
👉 మాజీ
మంత్రి తన్నీరు హరీష్ రావు
👉 ఈ
సీటు మళ్లీ బీఆర్ఎస్దే
👉 ప్రతి
గ్రాడ్యుయేట్ గడప తట్టండి
👉 కాంగ్రెస్
పాలన వద్దంటున్న ప్రజలు
👉 ఓటనే
ఆయుధంతో నిద్రపోతున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
👉 హైదరాబాద్
విషయంలో కుట్రలు
👉 హైదరాబాద్
లేని తెలంగాణా తల లేని మొండెం లాంటిది
👉 మళ్లీ
మరో 10
ఏళ్ళు ఉమ్మడి రాజదానిగా చేసే కుట్ర
గ్రాడ్యుయేట్ సోదరులు తమ ఓటే ఆయుధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అబద్ధాల కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టభద్రులకు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్ది ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం సత్తుపల్లి, బోనకల్ లో పట్ట భద్రులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమాజానికి సేవ చేయాలనే తలంపుతో వచ్చిన రాకేష్ రెడ్డిని దండిగా దీవించి, ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తే నేను అసెంబ్లీలో, ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడతామని చెప్పారు. ఎప్పుడూ బీఆర్ఎస్ గెలిచే ఈ సీటును మళ్లీ బీఆర్ఎస్సే గెలవబోతుందని స్పష్టం చేశారు. సమయం తక్కువుగా ఉన్నందున ప్రతి గ్రాడ్యుయేట్ గడప తట్టి, ఓట్లు అడగాలని అన్నారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పనైపోయిందని, కాంగ్రెస్ అంటేనే దగా.. మోసమని ప్రజలకు స్పష్టమైన క్లారిటీ వచ్చిందన్నారు. బస్ తప్పా అన్నీ తుస్సేనని తేలిపోయింద న్నారు. వంద రోజులు దాటినా ఒక్క హామీ పత్తా లేదన్నారు. మహిళలకు రూ.2500, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అవ్వా తాతకు రూ.4 వేల పెన్షన్, స్కూటీ లు, విద్యార్థు లకు రూ.5 లక్షల భరోసా కార్డు, తదితరవన్నీ అబద్దాలేనని తేలిపోయిందని తెలిపారు. నమ్మి ఓట్లు వేస్తే అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్ పాలన ఇక వద్దు రా నాయనా.. అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ లో ఉందని ధ్వజమెత్తారు. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు విజ్ణతతో ఆలోచించి ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడమంటే వారి అబద్దాలను కూడా అంగీకరించడమే అవుతుందని అన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చిందని అన్నారు. మునమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారిమేనని, రైతు బిడ్డకు ఓటేసి , నిద్రపో తున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని అన్నారు.ఆనాడు కాంగ్రెస్, బీజేపీ కుట్రల ఫలితంగా జిల్లాలోని ఏడు మండలాలను ఏపీకి అప్పగించాల్సి వచ్చిందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ విషయంలో కుట్రలు చేస్తున్నారని, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంతో పాటు మరో 10 ఏళ్ళు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేయాలనే కుట్రలు చేస్తున్నా రని, హైదరాబాద్ లేని తెలంగాణా తల లేని మొండెం లాంటిదని హరీశ్ రావు అన్నారు
ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ వరంగల్ లో రైతు కుటుంబంలో పుట్టి పెరిగి, ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని ప్రజా సేవ కోసం వచ్చిన రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించా లని కోరారు. నీతి, నిజాయితీ పరుడు, విద్యావంతుడని అన్నారు. ప్రజల్ని అన్నింటా మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీయాలని అన్నారు.
అభ్యర్ది రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రజా గొంతుకనై గర్జించి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కి ఓటేస్తే ఆయన ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారని అన్నారు. హామీలపై, జీవో 46 పై ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ను నిలదీశారు. సమాజానికి మంచి చేయాలనే తపనతో వచ్చిన తనకు ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో రుజువు చేసుకుంటానని అన్నారు. జీవో 46 కి సంబంధించి న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. వేల మంది నిరుద్యోగులతో వెళ్లి సీఎం ఇంటి ముందు కూర్చుంటామని చెప్పారు. ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా వచ్చిన గౌరవ వేతనం, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ ను సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, నిరుద్యోగు లకు ఖర్చు చేస్తానని వెల్లడిం చారు.
సత్తుపల్లి, బోనకల్లు లో జరిగిన సమావేశాలకు పెద్ద ఎత్తున పట్టభధ్రులు హాజరు కావడం విశేషం.సత్తుపల్లి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షత వహించగా, బోనకల్లు లో జరిగిన సమావేశానికి జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షత వహించారు. బోనకల్లులో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, బొమ్మెర రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, జెట్పీటీసీ, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment