రెండవ ప్రాధాన్యతే ... కీలకం

ఉమ్మడి ఖమ్మ , నల్గొండ , వరంగల్ జిల్లాల పట్టభధుల నియోజక వర్గ ఎం.ఎల్.సి ఎన్నికలు చెదురు మొదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఓటర్లలో 72.37 శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఓట్లను మాత్రం జూన్ 5న లెక్కిస్తారు. ఆ తరువాత ఎవరు గెలిచారన్నది తేలడానికి రెండు , మూడు రోజులు పట్టోచ్చు. ఈ ఓట్ల లెక్కింపు అన్నది ఒక సుధీర్ఘమైన ప్రక్రియ . ఓట్లు వేసే పద్దతిలోనూ ... లెక్కించే విధానంలోనూ ... సాధారణ ఎన్నికలతో పోలిస్తే ... చాలా తేడా వుంటుంది. అందుకే ఈ ఎన్నికలకు ఈవీఏంలు కాకుండా బ్యాలెట్లు వాడారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఈ ఎన్నికలోనూ ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్ధినే విజేతగా ప్రకటిస్తారు. కానీ ... ఆ అభ్యర్ధికి పోలైన ఓట్లలో 50 శాతం కన్నాఒక్క ఓటైనా ఎక్కువ రావాలి. అంటే ... పోలైన ఓట్లలో సగం ఓట్లు వచ్చినా సరిపోదు అదనంగా మరో ఓటు రావాలి. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఒకే. నాకు తెలిసి ... కేవలం మొదటి ప్రాధాన్యతా ఓట్లతోనే ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ... అంతకు ముందు ఉమ్మడ...