ఓట్ల కోసం ఎన్ని విద్యలో ... చెప్పులు పాలీష్ చేసిన మంత్రి పువ్వాడ


కూటి కోసం కోటి విద్యలన్నారు గానీ ... ఓట్ల కోసం ఎన్నివిద్యలో ... అంటే బాగుండేది. ఎందుకంటే ... ఎన్నికల వేళ ... పోటీ చేస్తున్నఅభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతుంటారు. చిత్ర విచిత్రంగా ప్రచారం చేస్తారు. పిల్లల్ని ఎత్తుకోవడం, టీ కాయడం, దోశలు వేయడం, అన్నం తినిపించడం, స్నానం చేయించడం ...  ఇవన్నీ సహజంగా ఎన్నికల ప్రచారంలో చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాలలో ఇంతకన్నా ఆశక్తికరంగా అభ్యర్థులు ప్రచారం చేస్తుంటారు. అటువంటి ఆశక్తికర ప్రచారమే ఈ రోజు ఖమ్మం నగరంలో జరిగింది. ఖమ్మం నియోజకవర్గ బి. ఆర్. ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు చెప్పులు పాలీష్ చేశారు. స్టేషన్ రోడ్డులో తన ఎన్నికల ప్రచారాన్ని సాగించిన పువ్వాడ ... చెప్పులు కుట్టే దళిత కార్మికుడ్ని తనకు ఓటేయమని కోరారు. ఆ తర్వాత అక్కడే ... క్రింద కూర్చొని చెప్పులకు పాలీష్ చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ... మీకు సేవకుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల బాగోగులు చూసేది తమ ప్రభుత్వమేనని ... అందుకే ... మరోసారి బి. ఆర్.ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. అంతకు ముందు ... అక్కడే ఉన్న పాన్ షాప్ లో పాన్లు కట్టి ఓటర్లను ఓట్లు అడిగారు. హోటల్లో తానే స్వయంగా చాయ్ పెట్టి కష్టమర్లకు అందించారు. ఇలా ఈ రోజంతా ... ఎదో ఒక పని చేస్తూ ... ఓట్లు అడుగుతూ ... అజయ్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మరి ఇంత కష్టపడ్డా .. ఓట్లు పడతాయా ? తనకు ఎక్కువ కూలి ( భారీ మెజార్టీ ) కావాలంటున్న పువ్వాడకు ... ఈ విద్యలు ఓట్లు తెచ్చి పెడతాయో లేదో చూడాలి. 

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే