భద్రాచలం కాంగ్రెస్ లో బగ్గుమన్న విబేధాలు

వీధిన పడ్డ పోదెం , తెల్లం వర్గాల మధ్య ఆధిపత్య పోరు దుమ్ముగూడెం మండలంలో తెల్లానికి వ్యతిరేకంగా ప్లెక్షీలు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుతో బయట పడ్డ అసంతృప్తి ఒక్క సారిగా భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విబేధాలు బగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే , రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య , స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మధ్య కొంత కాలంగా ఏర్పడ్డ అగాధం కాస్త , వివాదంగా మారి వీధిన పడింది. దుమ్ముగూడెం మండలంలోని ములక పాడు సెంటర్ , నర్సాపురం , లక్ష్మీ నగరంలో ఎమ్మెల్యే తెల్లంకు వ్యతిరేకంగా ప్లెక్షీలు వెలిశాయి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమక్షంలో ఇందిరమ్మ కమిటీలు వేస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ పలు చోట్ల ప్లెక్షీలు పెట్టారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వారికే ఇందరమ్మ కమిటీల్లో స్థానం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకూ నివురు గప్పిన నిప్పుగా వున్న వర్గ పోరు , ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సందర్భంగా బగ్గు మనడం భద్రాచలం నియోజక వర్గంలో ఇప్పు...