చైర్మన్, వార్డుల రిజర్వేషన్ మార్పుతో మారనున్న ఆశావాహుల తలరాతలు
తొలిసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు ( తాళ్లూరి అప్పారావు, మధిర ) మధిర మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావాహులు తమ తలరాతలు మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్లో ప్రకటించిన చైర్మన్, వార్డుల రిజర్వేషన్లు గతంలో ఉన్న రిజర్వేషన్లకు పూర్తి భిన్నంగా ఉండటంతో గతంలో ఆ అవార్డుల్లో పోటీ చేసిన వారు ప్రస్తుతం వేరే వార్డులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా చైర్మన్ పదవి కూడా గత రెండు పర్యాయాలు ఎస్సి మహిళకు రిజర్వుడ్ కాగా తొలిసారిగా జనరల్ మహిళలకు కేటాయించడంతో మధిర మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. కోర్టుల తీర్పులకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే నిబంధనతో మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను 11 వార్డులు రిజర్వేషన్ పోగా మరో పదకొండు వార్డులు జనరల్, జనరల్ మహిళలకు కేటాయించారు. అయితే గతంలో జనరల్ గా ఉన్న 9,10 వార్డులు ఎస్సీలకు కేటాయించగా గతంలో ఎస్సీ కి రిజర్వుడుగా ఉన్న 11,12 వార్డులు ప్రస్తుతం జనరల్ కు మారాయి. గత ఎన్నికలలో జనరల్ గా ఉన్న13,14,15 వార్డులు ప్రస్తుతం బీసీలకు కేటాయిం...