655 పేజీల నివేదికను అసెంబ్లీలో పెట్టండి ... చీల్చి చెండాడుతాం : హరీశ్ రావు
తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 60 పేజీల నివేదిక అవాస్తవాలతో, రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నదని ఆరోపించారు. పూర్తి స్థాయి 655 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, అప్పుడు నిజానిజాలను ప్రజల ముందు ఉంచి, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హరీశ్‌రావు సవాలు విసిరారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని
ఆరోపించారు. రైతులకి యూరియా లేదని, హాస్టల్ విద్యార్థులకు సరైన ఆహారం అందడం లేదని, ఉద్యోగాల కోసం
నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ల్యాండ్ కన్వర్షన్, భవన నిర్మాణ అనుమతుల
కోసం కమీషన్లు తీసుకుంటోందని, రాష్ట్రమంతా కమీషన్ల మయంగా మారిందని మండి పడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్‌ల
కుట్ర
కాంగ్రెస్, బీజేపీలు
కలిసి కుట్ర చేస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు
కూలి పోయినా దానిపై నివేదిక ఇవ్వని ఎన్‌డీఎస్ఏ (NDSA), మేడిగడ్డ బ్యారేజీపై మాత్రం
రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే వచ్చి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. అసెంబ్లీ
ఎన్నికలకు ముందు ఒక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం
ముందు ఒక నివేదిక ఇచ్చారని ధ్వజ మెత్తారు.
కమిషన్ గడువు పొడిగింపుపై అనుమానాలు
హరీశ్‌రావు కమిషన్ గడువు పొడిగింపుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మొదట
కేసీఆర్,
హరీశ్ రావులను
పిలవాల్సిన అవసరం లేదని కమిషన్ పేర్కొన్నప్పటికీ, రాత్రికి రాత్రే గడువును
పొడిగించి తమకు నోటీసులు ఇచ్చారని, మీడియాలో లీకులు ఇచ్చారని, అయితే తమకు ఎలాంటి నోటీసులు
అందలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆయన కొట్టి పారేశారు.
అసెంబ్లీలో నిగ్గు తేలుస్తాం
ప్రభుత్వం విడుదల చేసిన 60 పేజీల నివేదిక కేవలం తమకు నచ్చిన పేరాలను
మాత్రమే లీక్ చేసిందని, పూర్తి నివేదికను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయని హరీశ్‌రావు
అన్నారు. ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన టీఏసీ, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజినీర్లను కూడా
తప్పు పడుతోందని ఆయన అన్నారు. పూర్తి 655 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే
వాస్తవాలను నిగ్గు తేల్చి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
.jpeg)
Comments
Post a Comment