నిబద్దత గల నాయకుడ్ని కోల్పోయాం ... అయోధ్యకు సీపీఐ నేతల ఘన నివాళి

CPI Leader Ayodhya

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య మరణంతో కమ్యూనిస్టు పార్టీ ఒక నిబద్దత కలిగిన నాయకుడ్ని కోల్పోయిందని సీపీఐ నేతలు అన్నారు. బుధవారం ఉదయం సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన బొల్లోజు అయోధ్య మృత దేహాన్ని ఖమ్మం పార్టీ కార్యాలయం గిరిప్రసాద్ భవన్ కు తీసుకొచ్చారు. సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావు, పాకాల పాటి వెంకటేశ్వరరావు (పెద్దాబ్బాయి), పార్టీ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంత రావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఎస్కే సాబీర్ పాషా, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి తదితరులు అయోధ్య పార్దివ దేహంపై పూల మాలలు వేసి -నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు మాట్లాడుతూ చిరు ప్రాయంలోనే ఎర్ర జెండా పట్టిన అయోధ్య, తుదిశ్వాస వరకు ఎర్ర జెండా నీడలోనే పని చేశారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తుది శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. అనేక అటు పొట్లను తట్టుకుని నిలబడిన అయోధ్య, భూ పోరాటంలో పాల్గొని వందలాది ఎకరాలు పంపిణీ చేశారని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మణుగూరు ప్రాంతంలోని -వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నిర్మాణం కోసం అయోధ్య విశేష కృషి చేశారని పేర్కొన్నారు.1980 దశకంలో -అప్పటి పీపుల్స్ వార్ బెదిరింపులకు సైతం అయోధ్య భయపడ లేదని అన్నారు. సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో నిలిచేవారని, సమస్యల పరిష్కారం కోసం తాను ఎంచుకున్న మార్గంలో తుది వరకు పోరాడే వారన్నారు. ఆయన మరణం పేద ప్రజలకు, హక్కుల కోసం పోరాడే వారికి తీవ్ర నష్టమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. అనంతరం అయోధ్య పార్థీవ దేహాన్ని అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయానికి, ఆ తర్వాత మణుగూరు, అశ్వాపురం మండలంలోని మొండి కుంట గ్రామానికి తరలించారు. అక్కడ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పాకాలపాటి లలిత రాజేశ్వరి, యర్రాబాబు, -మిరియాల రంగయ్య, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవింద రావు, సిద్దినేని కర్ణ కుమార్, ముత్యాల సత్యనారాయణ తదితరులున్నారు.  

CPI Leader Ayodhya

CPI Leader Ayodhya

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి