గుడిసెల్లో వున్న వాళ్ళు ఫోటోలతో రావాలి

 

Thummala Nageswara Rao

  • మొదట గుడిసెల్లో వున్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు
  • దశల వారీగా అర్హులందరికీ ఇళ్ళు మంజూరు
  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను తప్ప కుండా అందిస్తామని తొలి విడతలో గుడిసెల్లో ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇంకా గుడిసెలలో ఉన్న వారికి ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్లు రాని పక్షంలో ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామనన్నారు. గుడిసెల్లో ఉంటున్న వారి ఫోటోలు తీసుకొని రావాలని తెలిపారు. గురువారం ఆయన రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలనిలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ దశల వారీగా మిగిలిన అర్హులకు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. గ్రామాల్లో నిరుపేదలైన అర్హులకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి