ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరుతోనే ... వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

MLA Ramdas Naik

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైరాఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరునే అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం  వైరా మార్కెట్ యార్డులో నిర్వహించిన నియోజక వర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరంట్, వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భీమా, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్య శ్రీ తో 10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

వందల కోట్లతో వైరా నియోజక వర్గ అభివృద్ధి

వైరా నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో సిమెంట్ రోడ్డులు నిర్మించామని, రాజీవ్ కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తున్నామన్నారు. రూ. 125 కోట్లతో  యంగ్ ఇండియా స్కూళ్ళు, వంద పడకల ఆసుపత్రి లాంటి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. వైరా నియోజకవర్గ పరిధిలో మహిళల ఆర్థికాభివృద్ధి కి 15 స్త్రీ టీ సెంటర్లు, షీరాక్స్ సెంటర్లు 3, ఆర్టీసీ అద్దె బస్సులు 5, వివిధ రకాల యూనిట్లు మహిళా సంఘాలకు అందజేశామన్నారు. అలాగే 702 మహిళా సంఘాలకు 77.05 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేసినట్లు తెలిపారు. 4.83 కోట్ల 26 వేల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామన్నారు. ప్రమాద భీమా క్రింద రూ. 60 లక్షలు, రూ. 42 లక్షల లోన్ భీమా మంజూరు చేశామన్నారు. నియోజక వర్గంలో కొత్తగా 3855 రేషన్ కార్డులు జారీ చేసి, 10882 మంది సభ్యులను కొత్తగా చేర్చడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డిఆర్డీవో సన్యాసయ్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, అదనపు డిఆర్డీవో జయశ్రీ, వైరా మునిసిపల్ కమీషనర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు