సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటి విడుదల

 

Sitarama Project

  • ప్రభుత్వాన్ని ఒప్పించి నీటిని విడుదల చేయించిన తుమ్మల
  • నీటి కోసం ఉదయాన్నే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కలెక్టర్లకు ఫోన్లు
  • తుమ్మల విజ్ఞప్తి మేరకు నీటి విడుదలకు అంగీకరించిన ప్రభుత్వం
  •  బిజీ కొత్తూరు వద్ద మొదటి పంపు ఆన్ చేసిన ఎమ్మెల్యే పాయం

Thummala Nageswara Rao

సీతారామ ప్రాజెక్టు నుండి సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బిజీ కొత్తూరు వద్ద మొదటి పంపు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు నీరు అందక నారుమాళ్ళు, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉదయాన్నే  రైతుల విజ్ఞప్తితో రంగంలోకి దిగిన తుమ్మల, సీతారామ ప్రాజెక్టు నుండి నాగార్జునసాగర్ ఆయకట్టుకు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ప్రస్తుతం వర్షాలు లేక, సాగర్ నీరు రాక వరి నారుమళ్లు, పొలాలు ఎండిపోతున్నాయని నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యమవుతోందని, సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని సూచించారు. వెంటనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, సంబంధిత విద్యుత్ శాఖ అధికార్లతో మాట్లాడారు. తుమ్మల విజ్ఞప్తి మేరకు, రైతాంగ అవసరాలను దృష్టిలో వుంచుకొని తక్షణమే నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలకు నీరు అందుతుంది.


పాయం వెంకటేశ్వర్లు

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి