విప్లవ కారులు మృతదేహాలకు బీజేపీ భయపడుతోంది : కూనంనేని

Kunamneni Shambashiva Rao

విప్లవకారుల మృత దేహాలకు బీజేపీ నేతలు భయపడుతున్నారని, హతమార్చిన తర్వాత మృత దేహాలను కుటుంబీకులకు ఇచ్చేందుకు జంకుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు అన్నారు. మరణించిన తర్వాత కూడా విప్లకారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తారనే భయంతో బీజేపీ నేతలు జంకుతున్నారని, విప్లకారులను లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా 23వ -మహాసభలు శనివారం మధిర నియోజకవర్గ కేంద్రంలోని పోటు ప్రసాద్ నగర్ (రెడ్డి గార్డెన్స్) లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలకు ముందు పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ఎగుర వేశారు. మృత వీరుల స్మారక స్థూపాన్ని రాష్ట్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బీజేపీ నేతలు మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రశ్నించే వారిని లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులను తుదముట్టిస్తామని అమితా షా లాంటి వారు ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. ప్రజల పక్షాన పనిచేసే కమ్యూనిస్టులను లేకుండా చేయడం ఎవరి తరం కాదని, కమ్యూనిస్టు సిద్ధాంతం -విశ్వవ్యాపితమైన సిద్దాంతాన్ని ప్రతిపాదించిన కారల్ మార్క్స్, ఆయనకు సహకరించిన ఎంగిల్స్, అమలు చేసిన లెనిన్ ప్రపంచ -మానవాళికి కొత్త వెలుగులు నిచ్చారని తెలిపారు. సమాజ హితం కోరే కమ్యునిస్టుల అవసరం పెరుగుతోందని అన్నారు. ప్రపంచంలో సగం జనాభా కమ్యూనిస్టుల పాలనలోనే ఉన్నారని, దామాషా పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే భారత దేశంలో కూడా ఘననీయమైన స్థానాలు దక్కుతాయని పేర్కొన్నారు. బూర్జువా పార్టీల అంతిమ లక్ష్యం అధికారమేనని, కమ్యూనిస్టులకు మాత్రం ప్రజాభ్యుదయం, సమాజ మార్పు, ఆర్ధిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యమన్నారు. -దోపిడీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్న కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే అనేక చట్టాలు రూపొందాయని, సంక్షేమం అమలవుతోందని, ఇప్పుడు బీజేపీ ఆ చట్టాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని కూనంనేని విమర్శించారు. ప్రజల పక్షాన కమ్యూనిస్టులు బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐఖ్యం కావాలని పిలుపు నిచ్చారు. అప్పులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేసేందుకు జాప్యం చేస్తే సీపీఐ పోరుబాట పట్టక "తప్పదని హెచ్చరించారు. మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరి అప్పుల నుంచి బయటబడే మార్గాలను -అన్వేషించాని, సంక్షేమం, అభివృద్ధి విషయంలో దాట వేత దోరణి మానుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో తమ బలానికి అనుగుణంగా పొత్తులు కుదిరితే కలిసి పోటీ చేస్తామని, లేదంటే ఒటరి పోరుతో తమ సత్తా చాటుతామన్నారు. పార్టీ సభల్లో -విప్లవ కార్యచరణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఓటమి తర్వాత కొందరు నాయకులు వేరే దారులు -వెతుక్కుంటారని, అదే దారిలో బీఆర్ఎస్ కవిత పయనిస్తోందని అన్నారు. ఈ మహాసభల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం, జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, షాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ఎర్రా బాబు, ఎస్ కే జానిమియా, ఏపూరి లతాదేవి కొండపర్తి గోవింద రావు సిద్దినేని కర్ణకుమార్ ఆహ్వానసంఘం బాద్యులు కర్నాటి రాంమోహన్ రావు బెజవాడ రవిబాబు  యం.ఎ రహీమ్, వూట్ల కొండల రావు పాల్గొనగా నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, మందడపు రాణి, అజ్మీరా రామ్మూర్తి, దొండపాటి రమేష్, మేకల శ్రీనివాస రావు, ఎంగల ఆనంద రావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు