పురుషోత్తం పట్నం దాడి ఘటనపై విచారణకు తుమ్మల ఆదేశం
- భూములపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని ప్రకటన
- భూములు దేవస్థానం పరిధిలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి
భద్రాచలం రామాలయం భూముల్లో ఆక్రమణలను అడ్డుకొనేందుకు వెళ్ళిన ఆలయ ఈఓ రమాదేవిపై పురుషోత్తం పట్నం గ్రామస్తులు కొందరు దాడి చేయడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మలనాగేశ్వర రావు తీవ్రంగా ఖంఢించారు. ఈ దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ఆదేశించారు. భూముల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. భూములు దేవస్థానం పరిధిలో ఉంటేనే దేవాలయ అభివృద్ధి సాధ్యమన్నారు.
.jpeg)
Comments
Post a Comment