ప్రశ్నించకుండా యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారు
- డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్
విద్య, ఉద్యోగాలపై
ప్రశ్నించకుండా యువతను పాలకులు మత్తుకు బానిసలు చేస్తున్నరని,మాదకద్రవ్యాల, బెట్టింగ్ యాప్స్
నిర్మూలనకై డి.వై.ఎఫ్.ఐ సమరంలో యువత కదలి రావాలని డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు
కోట రమేష్ పిలుపు నిచ్చారు. డి.వై.ఎఫ్.ఐ
ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెడు వ్యసనాలు వద్దు- ... పోరాటాలే ముద్దు అనే నినాదంతో
జిల్లా వ్యాప్తంగా12 రోజుల
పాటు చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సభ మంగళవారం రాత్రి ఖమ్మంలో
జరిగింది. డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ
సభలో కోట రమేష్ మాట్లాడుతూ సమాజంలో చెడు
రుగ్మతులుగా మారిన మాదక ద్రవ్యాలు (డ్రక్స్), మద్యపానం, ఆన్లైన్ బెట్టింగ్
యాప్స్ నిర్మూలనకు అందరూ కలిసి ఐక్యంగా పోరాడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
యువతకు,
నిరుద్యోగులకు
ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. విద్యార్దులు, యువత వారి హక్కుల గురించి, సమస్యల గురించి
ప్రశ్నించ కుండా నేటి పాలకులు వారిని చెడు వ్యసనాలకు బానిసలను చేస్తున్నారని ఆవేదన
వ్యక్తం చేశారు. ఖమ్మం త్రీ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కొండల్ రావు మాట్లాడుతూ సమాజ
భాగస్వామ్యంతో ఐక్యంగా డ్రక్స్ మాఫియాను అరికట్టాలని పిలుపు నిచ్చారు. ప్రముఖ
వైద్యులు యలమంచిలి.రవీంద్రనాధ్ మాట్లాడుతూసమాజ మార్పుకు ఆటంకంగా ఉన్న చెడు
వ్యసనాలపై ప్రజలు పోరాడాలన్నారు. ఈ సభలో డి.వై.ఎఫ్.ఐ మాజీ నాయకులు బొంతు.రాంబాబు, వై.విక్రమ్, యర్రా.శ్రీనివాసరావు, యం. ఏ జబ్బర్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా
అధ్యక్షడు మద్దాల ప్రభాకర్, జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దిన్, రాష్ట్ర కమిటీ సభ్యులు
చింతల రమేష్, యాత్ర
మేనేజర్ సత్తెనపల్లి నరేష్, జిల్లా నాయకులు గుమ్మ ముత్తరావు, బొడ్డు మధు, కూరపాటి శ్రీను, విజయ్ తదితరులు
పాల్గొన్నారు.

Comments
Post a Comment