కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు
- ఖారారు చేసిన రాష్ట్ర మంత్రి మండలి
- సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు
కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్
సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
తెలిపింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే
కాంగ్రెస్ సర్కారు మైనింగ్ కళాశాలను యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పుడు మరో
ముందడుగు వేసి యూనివర్సిటీకి , ప్రముఖ ఆర్థిక వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్
సింగ్ పేరును ఖరారు చేసింది. క్యాబినెట్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
నాగేశ్వరరావు హార్షం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి మండలి సభ్యులకు తుమ్మల నాగేశ్వరరావు
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి
కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టడంతో దేశవ్యాప్తంగా
ప్రత్యేక గుర్తింపు లభించునుంది.
300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం
ఈ విశ్వవిద్యాలయం ( సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ ) దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో రూపు దిద్దుకుంది. అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోంది. ప్రస్తుతం ఈ మైనింగ్ కళాశాల మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడంతో వేలాది మంది యువ శాస్త్రవేత్తల ఇక్కడి నుంచే తయారుకానున్నారు. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను ప్రవేశ పెట్టడం వల్ల జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి విశ్వవిద్యాలయం ఒక అమెరికాలో మాత్రమే ఉన్నది.
.jpeg)
.jpeg)
Comments
Post a Comment