వికాసానికి ‘ సీబిల్ స్కోర్ ’ తో పని లేదు
- లేని పోని అపోహలోద్దన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- అది సామాజక మాధ్యమాల్లో అవగాహన లేని ప్రచారమని వెల్లడి
- ఈ నెల 28 నాటికి శాంక్షన్ ప్రక్రియ పూర్తి, జూన్ 2న శాంక్షన్ లెటర్ల అందజేత
రాజీవ్ యువ వికాస పథకం అమలుకు ‘ సీబిల్ స్కోర్’ తో పని లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
స్పష్టం చేశారు. అభ్యర్ధుల ఎంపికకు బ్యాంక్ క్రెడిట్ స్కోర్ చూస్తారన్న అపోహలు వున్నాయని, దీనిపై అభ్యర్థులెవరూ ఆందోళన
చెందాల్సిన అవసరం లేదన్నారు. సిబిల్ స్కోర్ అనేది సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న
అవగాహన లేని ప్రచారం మాత్రమేనన్నారు. స్కోరింగ్ తో పని లేకుండా అర్హులైన ప్రతి
ఒక్కరికి పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ నెల 28 నాటికి శాంక్షన్ ప్రక్రియ పూర్తి చేసి, జూన్ 2న రాష్ట్ర అవతరణ
దినోత్సవ సందర్భంగా శాంక్షన్ లెటర్స్ అందజేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఇల్లందు
నియోజక వర్గంలోని ముత్యాలం పాడు క్రాస్ రోడ్ వద్ద 2.4 కోట్ల రూపాయలతో
నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
అనంతరం భట్టి విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో
నిరుద్యోగ యువతీ యువకులు వారి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాజీవ్ యువవికాస పథకాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులకుఈ పథకం ఒక వరమని భట్టి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో
57 వేల ఉద్యోగాలు ఇచ్చామని, అయినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు రానీ నిరుద్యోగుల కోసం దేశంలో ఎక్కడ
లేని విధంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గత
నాలుగేళ్లుగా ఎస్సీ,
ఇతర కార్పొరేషన్ల లోన్లు తీసుకునే వారికి కాకుండా, కొత్త వారికి ఈ రుణాలు
ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇల్లందు, మహబూబాబాద్ ప్రాంత ప్రజా ప్రతినిధుల
విజ్ఞప్తి మేరకు, బయ్యారం, తులారం ప్రాజెక్టులపై
సర్వే చేసి ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చేలా చిత్త శుద్ధితో చర్యలు తీసుకుంటామని హామీ
ఇచ్చారు. ఈ పర్యటనలో అటవీ శాఖ అభవృది సంస్థ ఛైర్మెన్ పోదేం వీరయ్య, ఇల్లందు, వైరా శాసనసభ్యులు కోరం
కనకయ్య,
రాందాస్
నాయక్,
భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా కల్టెర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ తదితరులు
పాల్గొన్నారు.
.jpeg)

Comments
Post a Comment