అటవీ సంరక్షణ ... అభివృద్ధి ... వనరుల పెంపే ధ్యేయం

 

Thummala Nageswara Rao

  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏజెన్సీ అభివృద్ధిపై తుమ్మల దృష్టి
  • అటవీ శాఖా ఉన్నతాధికార్లతో ప్రత్యేక సమావేశం
  • అటవీ శాఖ పెండింగ్ సమస్యలపై సుదీర్ఘ చర్చ
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 పార్కుల అభివృద్ధికి చర్యలు
  • రోడ్ల నిర్మాణం, పోడు భూముల్లో వెదురు సాగుపై దృష్టి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ సంరక్షణ,  అభివృద్ధి, గిరిజన, దళిత వర్గాల ఆదాయ వనరుల పెంపు దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తీవ్రవాద ప్రభావితం ప్రాంతాల నిధుల(ఎల్ డబ్ల్యు నిధులు) నుంచి కోట్లాది రూపాయలతో రహదారుల అభివృద్ధి, విస్తరణకు కృషి చేసిన తుమ్మల, ఎల్ డబ్ల్యూ ఈ పేజ్ 1,2,3,లలో కోట్లాది రూపాయల నిధులతో రహదారుల నిర్మాణం చేపట్టారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పలు మార్లు భేటీయై రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అంతే కాకుండా లేఖ కూడా రాశారు. ఇదే అంశంపై మంగళవారం ప్రధాన అటవీ సంచాలకులు (పీసీసీఎఫ్ ) సువర్ణ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సునీతతో సమావేశమయ్యారు.

రహదారుల నిర్మాణానికి అనుమతులివ్వాలి

 ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్కుల అభివృద్ధి, పెండింగ్ రహదారుల నిర్మాణానికి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని జూలూరుపాడు మండలంలో పడమటి నర్సాపురం నుంచి అన్నారు పాడు, చుంచుపల్లి మండలంలో పాత అంజనా పురం నుంచి బేతంపూడి వరకు, సుజాతనగర్ మండలాల్లో కొమ్ముగూడెం నుంచి రాఘవపురం వరకులక్ష్మీదేవి పల్లి మండలంలో హేమచంద్ర పురం నుంచి జూబ్లీ పురం గుట్ట, టేకులపల్లి మండలంలో వెంకటా తండా నుంచి కుంట్ల రోడ్డు వరకు, దుమ్ముగూడెం మండలంలో కొత్తపల్లి మెయిన్ రోడ్డు నుంచి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు.

పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

అదే విధంగా పర్యాటకులను ఆకర్షించేలా ఆధునిక హంగులతో అత్యాధునిక సౌకర్యాలతో పార్కుల నిర్మాణాన్ని శర వేగంగా చేపట్టాలన్నారు.  పార్కులను అభివృద్ధి చేస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారని, పార్కుల అభివృద్ధితో ఈ ప్రాంత రూపు రేఖలు మరింతగా మారుతాయన్నారు. అభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రధానంగా ఖమ్మంలోని వెలుగుమట్ల పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలంలోని కనిగిరి హిల్స్ ఎకో టూరిజంకొత్తగూడెంలో ఎకో పార్కు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

ఆదాయ వనరులకు సైతం పెంపొందించాలి

ఏజెన్సీ ప్రాంతంలో దళిత, గిరిజనులకు ఆదాయ మార్గాల పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ భేటీలో ప్రస్తావించారు. ఏజెన్సీ ప్రాంతంలో అడవుల సంరక్షణకు నడుం బిగించి, గిరిజనుల ఆదాయం పెంపొందించే మార్గాలను అన్వేషించాలన్నారు. పర్యాటక అభివృద్ధితో గిరిజనుల అభివృద్ధి చెందే అవకాశము ఉందన్నారు. పోడు భూములలో వెదురు సాగుకు శ్రీకారం చుట్టాలన్నారు. తద్వారా గిరిజనులకు ఆదాయ వనరులు పెంపొందుతాయని, వన సంరక్షణతో ప్రకృతి ఫరీడవిల్లుతుందని తెలిపారు. 

Khammam Urban Park

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి